శ్రీశైలంలో బయటపడ్డ పురాతన మండపం | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో బయటపడ్డ పురాతన మండపం

Published Thu, May 12 2016 10:10 PM

శ్రీశైలంలో బయటపడ్డ పురాతన మండపం - Sakshi

శ్రీశైలం: ఆంధ్ర, తెలంగాణా ప్రజల తాగునీటి అవసరాల కోసం రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలం జలాశయం జలాశయంలో మునిగి ఉన్న మండపం పూర్తిస్థాయిలో బయటపడింది. ఈ మండపాన్ని క్రీ.శ. 1393-96 మధ్య కాలంలో విఠలాంబ నిర్మించినట్లు చారిత్రక అధారాలు ఉన్నాయి.

ఒకప్పుడు పాతాళగంగలో భక్తులు స్నానాలాచరించడానికి వీలుగా మెట్ల మార్గాన్ని విఠలాంబా నిర్మించిందని, అలాగే పాతమెట్ల మార్గాన్ని రెడ్డిరాజులు నిర్మించారని... ఎంతో లోతైన ప్రదేశం కావడం వల్ల మార్గమధ్యంలో విశ్రమించడానికి వీలుగా ఈ మండపాలను నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. సుమారు 20 ఏళ్ల తరువాత మండపం పూర్తిస్థాయిలో బయటపడింది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 780 అడుగులకు చేరుకుంది.

Advertisement
Advertisement