దుర్గమ్మ ఆలయ హుండీ కానుకల ఆదాయం రూ.1.25 కోట్లు

12 Dec, 2016 14:41 IST|Sakshi
దుర్గమ్మ ఆలయ హుండీ కానుకల ఆదాయం రూ.1.25 కోట్లు

విజయవాడ(ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ హుండీ కానుకల ఆదాయం రూ.1.25 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను బుధవారం మహా మండపంలో ఆలయ సిబ్బంది లెక్కించారు. 12 రోజులకు గాను, 29 హుండీల ద్వారా రూ.1,25,26,355, 278 గ్రాముల బంగారం, 3.230 కిలోల వెండి వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు