సస్యరక్షణతో అధిక లాభాలు | Sakshi
Sakshi News home page

సస్యరక్షణతో అధిక లాభాలు

Published Sat, Aug 13 2016 10:41 PM

గ్రామపటం ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు - Sakshi

– వ్యవసాయ విశ్వవిద్యాలయ అసోసియేట్‌ డీన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి
– గుడిబండలో గ్రామపటం ద్వారా రైతులకు అవగాహన సదస్సు
 
దేవరకద్ర రూరల్‌ : పంటల సాగులో సస్యరక్షణతోనే అధిక లాభాలు వస్తాయని హైదరాబాద్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్‌ డీన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం దేవరకద్ర మండలం గుడిబండలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విద్యాలయ నాలుగో సంవత్సరం విద్యార్థులు పీఆర్‌ఏ (భాగస్వామ్య విశ్లేషాత్మక తులనం) పటం వేసి రైతులకు అవగాహన కల్పించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ కాలానుగుణంగా పంటలు వేస్తూ భూములకు తగ్గ సేద్యాన్ని చేయాలన్నారు. వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే కచ్చితంగా లాభాలు వస్తాయన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు తాము వేసిన పటంలో గ్రామంలో ఏయే పంటలు పండుతాయి, వాతావరణ పరిస్థితులు వచ్చే తెగుళ్లు తదితర వనరులను చూపించారు. వ్యవసాయంపై మెళకువలను ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మీదేవమ్మ, ఉపసర్పంచ్‌ కొండారెడ్డి, వ్యవసాయ ప్రొఫెసర్లు డాక్టర్‌ సుజాత, డాక్టర్‌ సునీతాదేవి, మహబూబ్‌నగర్‌ ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ రామకష్ణబాబు, ఏఓ కిరణ్‌కుమార్, వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు అనూష, ప్రవళిక, మడిదిప్తిరెడ్డి, మనోజ్ఞ, కె.శ్రీనివాస్‌రెడ్డి, వి.నిఖిత తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement