మూతపడిన విద్యా సంస్థలు | Sakshi
Sakshi News home page

మూతపడిన విద్యా సంస్థలు

Published Mon, Aug 1 2016 11:02 PM

ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాల నేతలు

పలమనేరు: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పలమనేరులో సోమవారం జరిగిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. విద్యారంగంలోని సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో విద్యార్థిసంఘాలు పట్టణంలోని విద్యాసంస్థలను మూసివేయించారు. గుడియాత్తం రోడ్డు, మెయిన్‌రోడ్డులలో ర్యాలీ చేశారు. అనంతరం స్థానిక హైస్కూల్‌ వద్ద  ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు పురుషోత్తం ప్రసంగించారు. రాష్ట్రంలో 487 సంక్షేమ హాస్టళ్లను  ప్రభుత్వం మూసివేయడం బాధాకరమన్నారు. కార్పొరెట్‌ విద్యా దోపిడీని ప్రభుత్వం పెంచిపోషిస్తోందని ఆరోపించారు. పెంచిన ఇంజనీరింగ్‌ ఫీజులను తగ్గించాలని, ఫీజుల నియంత్రణ  చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.  రాయలసీమ విద్యార్థి సంఘం నేతలు కూడా బంద్‌లో పాల్గొన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు నగరం బాలాజీ విద్యారంగంపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు రాఘువేంద్ర,కిరణ్, ప్రకాష్,శ్రీనివాస్, మంజునాథ్, ఆర్వీఎస్‌ నాయకులు అశోక్‌ మాట్లాడారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement