నకిలీ పాస్‌పుస్తకాలపై విచారణ | Sakshi
Sakshi News home page

నకిలీ పాస్‌పుస్తకాలపై విచారణ

Published Tue, Apr 4 2017 1:35 AM

enquiry on fake passbooks

చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : చెన్నేకొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న నకిలీ వ్యవసాయ పట్టాదారు పాసుపుస్తకాలపై కర్నూలు సీబీసీఐడీ సీఐ చిన్నగౌస్‌ సోమవారం తహశీల్దార్‌ కార్యాలయంలో విచారణ చేపట్టారు. కర్నూలు నుంచి వచ్చిన సీఐ తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్‌ నాగరాజుతో పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఏయే గ్రామాల్లో నకిలీ పాస్‌ పుస్తకాలను ఎక్కువగా చేశారు అనే విషయాలను విచారించారు. పాస్‌పుస్తకాలు పొందిన వారి వివరాలు సేకరించారు.

Advertisement
Advertisement