సమాన పనికి.. సమాన హోదా, వేతనం | Sakshi
Sakshi News home page

సమాన పనికి.. సమాన హోదా, వేతనం

Published Fri, Jul 29 2016 12:11 AM

Equal treatment for equal work, wage

విద్యారణ్యపురి : పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేస్తూ సమాన పనికి సమాన వేతనం, హోదా ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరా ట కమిటీ నేతలు డిమాండ్‌ చేశారు. టీపీటీఎఫ్, టీఎస్‌యూటీఎఫ్, డీటీఎఫ్, పీటీఈ, టీఎస్‌పీటీఏ, టీజీ పీఈటీఏ, డీజీటీయూ, బీటీఈ, టీయూటీఏల ఆధ్వర్యాన ఉపాధ్యాయ సంఘా ల పోరాట కమిటీగా హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపక జ్వాల సంపాదకుడు ఎం.గంగాధర్‌ మాట్లాడుతూ 1983 సంవత్సరంలో కల్పించిన అప్‌గ్రెడేషన్‌ను 2005లో రద్దు చేశారన్నారు. ఈ మేరకు పోస్టుల అప్‌గ్రేడ్‌ సాధన కోసం ఉపాధ్యాయులు ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులతో పాటు అన్ని స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులే ఉండాలని నిబంధనలు చెబుతున్నా భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులనే కొనసాగిస్తూ వారికి పదోన్నతులు ఇవ్వకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కా ర్యదర్శి ఎస్‌.సదానంద్‌ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మద్దతుతో విస్త­ృతంగా ఆందోళనలు చేపడితేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తెలంగాణ వ్యాయామ ఉపా«ధ్యాయ సంఘం(టీజీపీఈటీఏ) అధ్యక్షులు ఎం.శ్రీరాంరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అనుసరించటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా చొరవచూపి పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ రమేష్, డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.రాంచందర్, టి.సుదర్శనం, టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సోమశేఖర్, బి.వెంకటరెడ్డి, టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యూ.అశోక్‌తో పాటు రమేష్, ఎం.ఏ.బాసిత్, బి.సుధాకర్, ఎం.సదాశివరెడ్డి, కె.సునంద, పర్వీన్, బైరి స్వామి, టి.లింగారెడ్డి, జి.నటరాజ్, సీహెచ్‌.రవీందర్‌రాజు, పెండెం రాజు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement