వితంతువులపై వివక్షను రూపుమాపాలి | Sakshi
Sakshi News home page

వితంతువులపై వివక్షను రూపుమాపాలి

Published Mon, Sep 26 2016 12:35 AM

వితంతువులపై వివక్షను రూపుమాపాలి

  • బాలవికాస ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సింగారెడ్డి శౌరిరెడ్డి
  • కాజీపేట రూరల్‌ : వితంతువులపై వివక్షను రూపుమాపాలని బాలవికాస ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సింగారెడ్డి శౌరిరెడ్డి పిలుపునిచ్చారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని బాలవికాస శిక్షణ సంస్థలో ఆదివారం వితంతు వివక్ష ఉద్యమంలో మత సంస్థల పాత్ర అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శౌరిరెడ్డి మాట్లాడుతూ వితంతువులపై వివక్షను రూపుమాపడానికి బాల వికాస కృషిచేస్తోందని తెలిపారు. తెలంగా నఅర్చక సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన హన్మకొండలోని వేయి స్తంభాలగుడిలో వితంతువులచే గౌరమ్మపూజ చేయించి బతుకమ్మ ఆటలాడిస్తానని ఆయన అన్నారు. బ్రహ్మశ్రీ తాండ్ర నాగేంద్రశర్మ మాట్లాడుతూ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని మానవాళి అభివృద్ధి కాంక్షిస్తూ మనం రాసుకున్నవేనని, కాలమాన మార్పు ప్రకారంగా ఆచారాలు కూడా మార్చుకోవచ్చని పేర్కొన్నారు. డాక్టర్‌ శ్రీదేవి మాట్లాడుతూ వితంతువులపై వివక్ష పునరావృతం కాకుండా చూడాలని కోరారు. వరంగల్‌ డయాసిస్‌ ఫాదర్‌ జోసఫ్‌ మాట్లాడుతూ ఈ ఆచారాన్ని రూపు మాపేందుకు బాలవికాసకు తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం మత గురువు మోహినుద్దీ¯ŒS మాట్లాడుతూ ముస్లిం మతంలో ప్రవక్త ఒక వితంతువును వివాహాన్ని చేసుకుని ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. బాలవికాస సంస్థ వ్యవస్థాపకురాలు బాలథెరిస్సా మాట్లాడుతూ వితంతువులపై వివక్షను రూపుమాపేందుకు 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.డాక్టర్‌ విశ్వనాథరావు, రిటైర్ట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ లక్ష్మణమూర్తి, డాక్టర్‌ కోదండ రామారావు, రమణగుప్తా, అష్టకాల నర్సమ్మ శర్మ, వేదాంతం జగన్నాథాచారి, ధూళిపాల శ్రీనివాస్, పవ¯ŒS శర్మ, ఫాదర్‌ జారోమ్, వల్లంపట్ల నాగేశ్వర్‌రావు, ప్రతినిధులు మంజుల, లత, ఉపేంద్ర బాబు, శివ, రాధిక, రమ, వితంతువులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement