అడుగడుగునా భరోసా.. | Sakshi
Sakshi News home page

అడుగడుగునా భరోసా..

Published Tue, Sep 27 2016 8:54 PM

అడుగడుగునా భరోసా.. - Sakshi

* సత్తెనపల్లి నియోజకవర్గంలో జననేత జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం
దారి పొడువునా జన నీరాజనాలు
ఆదుకునే నాథుడే లేరని బాధితులు కన్నీరు
అండగా ఉంటామని బాధితులకు బాసట
 
సత్తెనపల్లి: ఇటీవల కురిసిన వర్షాలకు ముంపునకు గురైన వరద బాధితులను వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అడగడుగునా పరామర్శిస్తూ వారికి భరోసానిచ్చారు. పంటలు నష్టపోయిన రైతులతో మాట్లాడి వారికి ఊరట నిచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలంలో  మంగళవారం  నేతలు, వరద బాధితులు, మహిళలు, రైతులు జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఉదయం 8 గంటలకే కొండమోడుకు చేరుకున్నారు.
 
పోట్టెత్తిన కొండమోడు.. 
కొండమోడులో జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశించడంతో పార్టీనేతలు, వరద బాధితులు, రైతులు, మహిళలు తమ బాధలను తెలియజేసేందుకు  పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు, చిన్నారులు, రైతులు, వృద్ధులు అన్ని వర్గాల ప్రజలు ఎవరికి వారే పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులకు జగన్‌మోహన్‌రెడ్డి అభివాదం చేశారు. తెల్లవారుజాము నుంచే కొండమోడు హైవే రోడ్డుపై అభిమానుల కోలాహలం ప్రార ంభమైంది. పార్టీ జెండాలు చేతపట్టి రోడ్డుపై జై జగన్‌.. జైజై జగన్‌ అంటూ నినాదాలు చేశారు.
 
గోడు పట్టించుకునే నాథుడే లేరు..
వరద బాధితుల పరామర్శలో భాగంగా రాజుపాలెం మండలంలోని  కోటనెమలిపురి చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి  గ్రామంలో మహిళలు, బాధితులు, రైతులు పెద్ద సంఖ్యలో ఎండిపోయిన పత్తి, మిర్చి, వరి పంటలను చేతి పట్టుకొని హైదరాబాద్‌ రోడ్డుపై  నిలిచి చూపించారు. జగన్‌మోహన్‌రెడ్డి వారితో కొంత సేపు ముచ్చటించారు. వరద ఉప్పెనల వచ్చి పంటలను ముంచెత్తినట్లు మహిళలు, రైతులు జగన్‌మోహన్‌రెడ్డి ముందు కన్నీటి పర్యంతమైయ్యారు. మా గోడు వినే నాథుడే లేరని వాపోయారు. పరిహారం అందే  వరకు ప్రభుత్వంతో పోరాడటం చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. గ్రామంలోని ఎర్రవాగు ఉధృతి కారణంగా నర్సరీ, మిర్చి పత్తి పంటలు 100 ఎకరాలకు పైగా కొట్టుకుపోయినట్లు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ నేతలు బాసు లింగారెడ్డి, మర్రి సుందరరామిరెడ్డి, మర్రి సుబ్బారెడ్డిలు వివరించారు.
 
అనుపాలెంలో..
జగన్‌మోహన్‌రెడ్డి అనుపాలెం సత్రంవాగు వద్ద 20 నిమిషాలు పాటు పార్టీ నేతలు, రైతుల తో కలసి వరద నీటికి కొట్టుకుపోయిన పంట పొలాలను పరిశీలించారు. నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు,  పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళగిరి ఎమ్మేల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి(ఆర్‌కే), మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను వరద ఉధృతి గురించి అడిగి తెలుసుకున్నారు. రాత్రికి రాత్రే వరద ఉప్పెనగా రావడంతో పంటలు పూర్తిగా కోల్పోయ్యామని రైతులు వివరించారు. పత్తి, మిర్చి, వరి పంటలకు ఇప్పటి వరకు ఎంత మేరకు పెట్టుబడి పెట్టారో అడిగి తెలుసుకున్నారు.  అనంతరం అనుపాలెం ఎస్సీకాలనీలోకి ప్రవేశించి నీట మునిగిన గృహాల బాధితులను ఓదార్చారు. కాలనీలోని ఇంటింటికి తిరిగి  సుమారు 15 నిమిషాలపాటు ఎస్సీకాలనీలోని ఆరు బజారులు తిరిగుతూ అక్కడ ఇళ్లు కోల్పోయిన  మహిళలను ఓదార్చారు. మందా ప్రేమమ్మ, లాజర్,బుజ్జి తదితర కాలనీ వాసులను వరద ఉధృతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు ఉన్నా కాలనీ అభివృద్ధి చేసేందుకు టీడీపీ నేతలు ఆసక్తి చూపడం లేదని జగన్‌ మోహన్‌రెడ్డి ముందు కాలనీ వాసులు వాపోయ్యారు. సర్పంచ్‌ బండి కొటినాగిరెడ్డితో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌ కావడంతో అభివృద్ధి పనులు చేయనియడం లేదని, ఇప్పటికే రూ10లక్షల పనులు చేసిన బిల్లులు రాకుండ ఇబ్బంది పెడుతున్న వైనాన్ని వివరించారు. పరిహారం కూడ ఇవ్వలేదని అన్నారు. ఐదు అడుగుల మేరకు నీరు వచ్చి ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని ఉన్నట్లు వారు కన్నీరు పర్యంతమైయ్యారు. అసమయంలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్నికి ప్రజలు బాధలు పట్టడం లేదని తాము అధికారంలోకి వచ్చాకా అందరికి ఇళ్లు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. పాథమిక పాఠశాల విద్యార్థులకు అభివాదం చేశారు.

Advertisement
Advertisement