నకిలీ కొబ్బరినూనె తయారీ కేంద్రంపై దాడి | Sakshi
Sakshi News home page

నకిలీ కొబ్బరినూనె తయారీ కేంద్రంపై దాడి

Published Wed, Nov 23 2016 10:53 PM

తయారీ విధానాన్ని వివరిస్తున్న నిర్వాహకుడు మహావీర్‌జైన్

మలక్‌పేట: నకిలీ కొబ్బరినూనె తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  మలక్‌పేట ఏసీపీ సుధాకర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..రాజస్థాన్ కు చెందిన మహావీర్‌ జైన్34) నగరానికి వలస వచ్చి చైతన్యపురి ఫణిగిరి కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతను జీడిమెట్లలోని ఐరన్ కంపెనీలో లేబర్‌గా, ఆ తరువాత ఢిల్లీనలోని ఓ ఫినాయిల్‌ కంపెనీలో పని కుదిరి కిరాణ వస్తువులను మార్కెటింగ్‌ చేయడంలో అనుభవం సంపాదించాడు. దీంతో  తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో 2016లో నగరానికి వచ్చి చైతన్యపురిలో మకాం పెట్డాడు. 

గతనెలలో సలీంనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ’మరికో లిమిటెడ్‌’ పేరుతో కల్తీ కొబ్బరి నూనె తయారు చేసేవాడు, బేగంబజార్, సికింద్రాబాద్‌ ప్రాంతాలనుంచి నాసిరకం కొబ్బరినూనె తీసుకొచ్చి ప్యారచూట్‌ కంపెనీ డబ్బాలలో నింపి తక్కువ ధరకు పాతబస్తీ, నగరశివారు ప్రాంతాల్లోని దుకాణాలకు సరఫరా చేసేవాడు. ప్యారాచూట్‌ కంపెనీ ప్రతినిధి సదానందం ఫిర్యాదు మేరకు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అతడి స్థావరంపై దాడులు నిర్వహించి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు.  మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు

. ఈ సందర్భంగా రూ. 3 లక్షల విలువైన  నకిలీ కొబ్బరి నూనె (750 లీటర్లు), ప్యారచూట్‌ ఆయిల్‌డబ్బాలు, ఫిల్లింగ్‌ మిషన్, వెయిటింగ్‌ మిషన్, కంపెనీ లేబుల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌సై ఏడుకొండలు కేసును దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement

తప్పక చదవండి

Advertisement