ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

22 Mar, 2017 00:43 IST|Sakshi
ఆలూరు రూరల్‌/హొళగుంద: ఆర్థిక ఇబ్బందులతో హొళగుంద మండలం సుళువాయి గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలో మౌలాసాహెబ్‌(45), ఉసేనమ్మ దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. తనకు ఉన్న రెండెకరాల పొలంలో ఐదేళ్లుగా వివిధ పంటలు సాగు చేసి నష్టపోయాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. మంగళవారం ఉదయం మౌలాసాహెబ్‌ పొలానికి వెళ్లి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గుర్తించడంతో కుటుంబీకులు వెంటనే ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి సొంతూరు హాలహర్వి మండలం కామినహాల్‌ గ్రామం కాగా.. 30 ఏళ్ల క్రితమే సుళువాయికి ఇల్లరికం వచ్చాడు.    
 
మరిన్ని వార్తలు