ఇటు ఎక్కడకి డాడీ? | Sakshi
Sakshi News home page

ఇటు ఎక్కడకి డాడీ?

Published Thu, Mar 24 2016 4:24 AM

ఇటు ఎక్కడకి డాడీ? - Sakshi

నాన్న వెంటే నడిచి ...ప్రాణాలు విడిచి
రూటు మార్చి పిల్లలను హతమార్చిన తండ్రి
♦  ఆపై ఆత్మహత్యాయత్నం
ఒంటరిగా ఉండటమే కారణం?
మనోవ్యథతో బాధపడుతున్న భార్య

 

 ‘సింగరకొండ తిరునాళ్లకు మా నాన్న తీసుకువెళ్తామన్నారు ... అందుకే నేను స్కూలుకు రాను ... మా తమ్ముడు కూడా అంగన్‌వాడీ బడికి పోడు ... జాతరలో సందడి చేస్తామంటూ తన ఈడు పిల్లలతో ఉత్సాహంగా చెప్పిన ఆ పసికందులకు తెలియదు తాము వెళ్తున్నది మృత్యుకౌగిట్లోకి అని. తండ్రి మాట వెనుక దాగి ఉన్న విషకాటుకు బలైపోతామని. నాన్న తెచ్చిన బైకు ఎక్కే సమయంలో కళ్లల్లో ఆనందం. అల్లంత దూరం తీసుకువెళ్లి శీతల పానీయం ఇస్తుంటే ‘మా నాన్న బంగారం’ అనుకున్నారు. కానీ ఆ గుటకే చిన్నారులపాలిట విష గుళికగా మారింది. ఐదారేళ్ల వయసులోనే ఆయుష్షును తీసేసింది.

 నాన్న గుండెలపై ఎక్కారు.. చేతిలో చేరుు వేసి ‘నువ్వే మా రక్షకుడు’ అని నమ్మారు  ఆప్యాయంగా ముద్దుల వర్షం కురిపించారు  ముద్దు మాటలతో ఉల్లాసాన్ని నింపారు  వారికి తెలియదు జీవాన్ని ఇచ్చిన నాన్నే ప్రాణాలు తీస్తాడని.. వారికి తెలియదు కొండంత అండగా ఉండే తండ్రే అనకొండగా మారతాడని చాక్లెట్లు ఇచ్చిన చేతులతోనే కూల్‌డ్రింక్‌లో విషం కలుపుతాడని సింగకొండ తిరునాళ్లకు వెళతామని ఉల్లాసంగా బయలు దేరిన ఇద్దరు చిన్నారులు తిరిగి రాని లోకాలకు వెళ్లారు వీళ్లంటే దేవుడికి ఇష్టమేమో.. ఇక్కడ బాధలు పడలేరని  తనలో కలుపుకున్నాడేమో...!  పిచ్చి తల్లిమాత్రం ఏమైందో తెలియక బిత్తర చూపులు చూస్తోంది..  -తాళ్లూరు

కన్న తండ్రి.. ఇద్దరు కుమారులకు పురుగులు మందు తాగించడంతో వారు మృతి చెందారు. ఆ తర్వాత అతనూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన విఠలాపురం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.  కైపు వెంకటరెడ్డికి అదే గ్రామానికి చెందిన మారం అంజిరెడ్డి కుమార్తె అనురాధతో పదేళ్ల క్రితం వివాహమైనది. వారికి ఇంద్రసేనారెడ్డి (7), యశ్వంత్‌రెడ్డి (5) సంతానంగా కలిగారు. పెద్దబ్బారుు యూకేజీ.. చిన్నోడు అంగన్‌వాడీలో చదువుతున్నారు. బుధవారం హోలీతో పాటు సింగరకొండ తిరునాళ్ల కావడంతో.. సింగరకొండ తీసుకువెళ్తానని తండ్రి, పిల్లలకు చెప్పాడు.

11 గంటల సమయంలో రె ండు శీతల పానీయూలు, పావు లీటరు నువాక్రాన్ పురుగుమందును తీసుకొని.. పిల్లలతో పాటు బైక్‌పై రమణాలవారిపాలెం వెళ్లే దారివైపు ఉన్న మర్రి చెట్టు వద్దకు తీసుకువెళ్లాడు. ‘ఇటు ఎక్కడకి డాడీ’ అని పిల్లలు అడిగారు. సమీపంలో ఉన్న భూదేవి ఆలయం వద్దకు వెళ్లి వద్దామని చెప్పాడు. అరుుతే అక్కడున్న బావి వద్దకు తీసుకువెళ్లి పురుగుమందు కలిపిన శీతల పానీయాన్ని ఇచ్చాడు. దాన్ని తాగిన పిల్లలు మృతి చెందిన తర్వాత పడుకోబెట్టి.. తాను కూడా అదే బాటిల్‌లో ఉన్న మందును తాగాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న రైతు అంజిరెడ్డికి విషయం చెప్పాడు.  బాధితుడిని ఒంగోలు వైద్యశాలకు తరలించారు. ఏఎస్సై బాష సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

 ఎందుకిలా..
పండుగ రోజు ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యూరు. తల్లి, బంధువులు మృత దేహాలను చూసి భోరున విలపించారు.  కొంత కాలం నుండి వెంకటరెడ్డి భార్య అనురాధ మానసిక పరిస్థితి సరిగా లేదు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా భార్య, పిల్లలు కూడా రాత్రి సమయూల్లో తాతయ్య నివాసంలో ఉంటున్నారు. భార్య మానసిక పరిస్థితి సక్రమంగా లేక పోవటం, రాత్రి ఒంటరిగా గడపాల్సి రావటంతో మనో వ్యథకు గురైన వెంకటరెడ్డి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

Advertisement
Advertisement