ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం

Published Sat, Sep 17 2016 11:37 PM

ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం

నూనెపల్లె: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు చేస్తామని ఏపీసీపీఎస్‌ సంఘం రాష్ట్ర గౌరవా«ధ్యక్షుడు, ఏపీఎంటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి అన్నారు. పశ్చిమ రాయలసీమ టీచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డి నంద్యాల డివిజన్‌లో శనివారం విస్తతంగా పర్యటించి విద్యా రంగ సమస్యలపై ఉపాధ్యాయులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్‌ విధానం రద్దు కోరుతూ రాయలసీమ స్థాయిలో ఉద్యమాలు చేపడుతున్నామన్నారు. సమ్మెటివ్‌ పరీక్షలను విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ టీచర్స్‌కు జీపీఎస్‌ అకౌంట్స్, సర్వీసు రూల్స్, పదోన్నతులపై జీఓలను త్వరగా విడుదల చేయాలన్నారు. జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకులు పదోన్నతలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అధ్యాపకులకు పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రచారాన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ, కేఎన్‌ఎం, టెక్కె, మున్సిపల్‌ స్కూల్, నేషనల్‌ జూనియర్‌ కళాశాల, హోలీక్రాస్‌ ఎయిడెడ్‌ స్కూల్, చాపిరేవుల జెడ్పీస్కూళ్లలో ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట ఏపీసీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామనరసింహ, ఏపీఎంటీఎఫ్‌ పట్టణ అధ్యక్షుడు వరప్రసాద్‌ రెడ్డి, జీజేఎల్‌ఏ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, నాయకులు బాలచంద్రుడు, శేఖర్, అంజయ్య, జిలానీ బాషా, ఈశ్వర్‌రెడ్డి, నాగశేషుడు, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement