బలవంతపు భూసేకరణపై ఉద్యమిస్తాం | Sakshi
Sakshi News home page

బలవంతపు భూసేకరణపై ఉద్యమిస్తాం

Published Sun, Oct 23 2016 9:37 PM

బలవంతపు భూసేకరణపై ఉద్యమిస్తాం

గన్నవరం : టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా  వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని అఖిల భారత  కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య పేర్కొన్నారు. సీపీఐ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వ భూ దోపిడీపై మండిపడ్డారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పేద రైతుల నుంచి భూములను లాక్కొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడం దారుణమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయంలో ఐదు వేల ఎకరాల్లో బందరు పోర్టు కడతామంటే గగ్గోలు పెట్టిన టీడీపీ నాయకులు ఇప్పుడు పోర్టు కోసం 33 వేల ఎకరాలను సేకరిస్తుండడం సిగ్గుచేటన్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో ఏ పరిశ్రమలకు భూములను కేటాయిస్తారో చెప్పకుండా సాగులో ఉన్న 1,400 ఎకరాలు స్వాధీనం చేసుకునే ప్రయత్నం సరికాదన్నారు. మల్లవల్లి రైతులకు కమ్యూనిస్టు పార్టీలు అండగా నిలుస్తాయని చెప్పారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్నీడి యల్లమందారావు, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రాణి, సీపీఐ ఏరియా కార్యదర్శి కొండా వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.



 

Advertisement

తప్పక చదవండి

Advertisement