ప్రాజెక్ట్‌ల కాలుష్యంపై సమైక్య పోరు | Sakshi
Sakshi News home page

ప్రాజెక్ట్‌ల కాలుష్యంపై సమైక్య పోరు

Published Sun, Jul 24 2016 12:48 AM

fighting for controle  pollution

  •  సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు
  •  ముత్తుకూరు : మండలంలోని థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌లు, ఓడరేవు, పామాయిల్‌ ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యం నియంత్రణకు సమైక్యంగా ఆందోళన సాగిస్తామని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు ప్రకటించారు. ఎంపీపీ తేట్ల వెంకటసుబ్బమ్మ, మండల ఉపాధ్యక్షుడు మురాల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు కోటేశ్వరావు, పొట్టెంపాడు, పంటపాళెం, తాళ్లపూడి, పిడతాపోలూరు, మల్లూరు, వల్లూరు, డమ్మాయపాళెం, నారికేళపల్లి సర్పంచ్‌లు పల్లంరెడ్డి జనార్ధనరెడ్డి, రొయ్యలరంగనా«ద్, నిమ్మా సుభాషిణి, తిరకాల ప్రభాకర్, పట్రా సుబ్రహ్మణ్యం, అన్నం మాధురి, పాముల సుజాత, దుబాకుల భాస్కర్‌ తదితరులు శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశమై విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్ట్‌లకు తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్ట్‌ల సీఎస్‌ఆర్‌ నిధులతో గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలన్నారు. కాలుష్యం నియంత్రించాలన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు లభించాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, పచ్చదనం విస్తరించాలన్నారు. ఈ సమస్యలపై అన్ని పంచాయతీల నుంచి తీర్మానాలు చేసి, అన్ని స్థాయిల్లో అధికారులకు అందచేస్తామన్నారు. భవిష్యత్‌ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. నాయకులు దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట్రామరెడ్డి, లక్ష్మణరెడ్డి, ఈపూరు కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement