పండగ వేళా పస్తులేనా | Sakshi
Sakshi News home page

పండగ వేళా పస్తులేనా

Published Mon, Jan 2 2017 10:11 PM

financial problems anganvadi workers

  • మూడు నెలలుగా వేతనాల్లేవు
  • అంగ¯ŒSవాడీల ఆకలి కేకలు
  • వేతన బకాయిలు రూ.18.22కోట్లు
  • అద్దె బకాయిలు రూ.5.95కోట్లు
  • గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని, కిశోర బాలబాలికలకు ఆటపాటలతో విద్యనందిస్తున్న అంగ¯ŒSవాడీల బతుకు భారమైపోయింది. మూడునెలలుగా వేతనాల్లేక వారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అందరికీ పెద్దపండగైన సంక్రాతికి సైతం తమకు పస్తులు తప్పవా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
     
    రాయవరం:
    అంగ¯ŒSవాడీలకు బకాయి భారం పెరిగిపోయింది. మూడు నెలలుగా అంగ¯ŒSవాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలను చెల్లించడం లేదు. అలాగే అంగ¯ŒSవాడీ కేంద్రాలకు అద్దె, రవాణా ఛార్జీల బకాయిలు నెలల తరబడి పేరుకు పోయాయి. జిల్లాలో 5,546 అంగ¯ŒSవాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 433 మినీ అంగ¯ŒSవాడీ కేంద్రాలు. ఈ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు నెలకు రూ.7వేలు, మినీ అంగ¯ŒSవాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్త, అంగ¯ŒSవాడీ కేంద్రాల్లో పనిచేసే ఆయాకు రూ.4,500 వేతనంగా చెల్లిస్తున్నారు. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ నెల వరకు వారికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. మూడు నెలలకు కలిపి అంగ¯ŒSవాడీ కార్యకర్తలకు రూ. 10,73,73,00, ఆయాలకు రూ. 7,48,71,000 వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని అంగ¯ŒSవాడీ కేంద్రాలకు అద్దె బకాయిలు సుమారు రూ.5.95కోట్లు ఉంది.  గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అంగ¯ŒSవాడీ కేంద్రాలకు నెలకు రూ.750, పట్టణ ప్రాంతాల్లో ఉన్న అంగ¯ŒSవాడీ కేంద్రాలకు రూ.3వేలు అద్దెగా ప్రభుత్వం చెల్లిస్తుంది. జిల్లాలో ఉన్న 25 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని కొన్ని ప్రాజెక్టుల్లో 8–10నెలలకు, మరికొన్ని ప్రాజెక్టుల్లో ఏడాదిగా అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉంది. అలాగే ఏడాదిగా అంగ¯ŒSవాడీ కేంద్రాల్లో పనిచేసే ఆయాలకు గ్యాస్‌ చార్జీల బకాయిలు చెల్లించాలి. ఒక్కో ఆయాకు నెలకు రూ.300 వంతున ఏడాదికి రూ. 1,99,65,600 చెల్లించాల్సి ఉంది. 
    పండుగ చేసుకునేది ఎలా..
     మూడు నెలల వేతన బకాయిలు, 10 నెలల కేంద్రాల అద్దె బకాయిలు చెల్లించకుంటే తాము అప్పు చేసి కేంద్రాలు ఎలా నిర్వహించాలంటూ వర్కర్లు ప్రశ్నిస్తున్నారు. క్రిస్మస్‌ పండుగ ఎలాగూ జరుపుకోలేకపోయామని, కనీసం సంక్రాంతి పండుగకైనా వేతనాలు, అద్దె, గ్యాస్‌ చార్జీల బకాయిలు విడుదల చేయాలని అంగ¯ŒSవాడీ కేంద్రాల వర్కర్లు, ఆయాలు డిమాండ్‌ చేస్తున్నారు.
     
    తక్షణం బడ్జెట్‌ విడుదల చేయాలి 
    అంగ¯ŒSవాడీ కేంద్రాల వర్కర్లు, ఆయాల బడ్జెట్‌ను ప్రభుత్వం సక్రమంగా విడుదల చేయాలి. సమయానికి వేతనాలు రాక కేంద్రాల నిర్వాహకులు అప్పుల పాలవుతున్నారు. ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించక పోవడం దారుణం.
    – ఎం.వీరలక్ష్మి, అంగ¯ŒS వాడీ వర్కర్లు, ఆయాల సంఘం జిల్లా అధ్యక్షురాలు 
    ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు
    పేరుకుపోయిన అద్దె బకాయిలతో ఇంటి యజమానుల నుంచి సమస్య ఎదురవుతోంది. వేతనాలు, అద్దె బకాయిలు రాకపోవడంతో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
    – ఎస్‌. కృష్ణకుమారి, జిల్లా కార్యదర్శి, 
    అంగ¯ŒSవాడీ వర్కర్లు, ఆయాల సంఘం.
     
    బడ్జెట్‌ రావాలి
    అంగ¯ŒSవాడీ వర్కర్లు, ఆయాలకు వేతనాల చెల్లించడానికి బడ్జెట్‌ విడుదల కావాల్సి ఉంది. మా ప్రాజెక్టులో 10నెలలుగా అంగ¯ŒSవాడీ కేంద్రాలకు అద్దె బకాయిలు, ఆయాలకు గ్యాస్‌ చార్జీల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
    – సీహెచ్‌ వెంకటనరసమ్మ, 
    పీఓ, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు, రాయవరం 
     

Advertisement
Advertisement