షార్ట్‌ సర్క్యూట్‌తో మొబైల్‌ షాపు దగ్ధం

14 Aug, 2016 23:37 IST|Sakshi
షార్ట్‌ సర్క్యూట్‌తో మొబైల్‌ షాపు దగ్ధం
సూర్యాపేట మున్సిపాలిటీ : షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ మోబైల్‌ షాపు దగ్ధమైన ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పూలసెంటర్‌లో గల గౌస్‌ మోబైల్స్‌ దుకాణాన్ని శనివారం రాత్రి రోజుమాదిరిగానే బంద్‌ చేసి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక్కసారిగా షార్ట్‌ సర్క్యూటై దుకాణం నుంచి పొగలు వస్తుండడంతో గమనించిన చుట్టుపక్కల వారు దుకాణ యజమానికి సమాచారం అందించారు. యజమాని వెంటనే లబోదిబోమంటూ దుకాణం వద్దకు చేరుకునే సరికి రూ. 20 లక్షల ఆస్తి బుగ్గిపాలైపోయింది. దుకాణంలో ఉన్న విలువైన మోబైల్స్, ఇతర సామగ్రి పూర్తి కాలిబూడిదైపోయింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వై.మొగలయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడు గౌస్‌ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

సినిమా

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు