ముగిసిన తొలివిడత కౌన్సెలింగ్‌ | Sakshi
Sakshi News home page

ముగిసిన తొలివిడత కౌన్సెలింగ్‌

Published Sat, Jul 1 2017 12:09 AM

ముగిసిన తొలివిడత కౌన్సెలింగ్‌ - Sakshi

ఎస్కేయూ : ఎస్కేయూసెట్‌–2017 కౌన్సెలింగ్‌కు విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. గత నెల 19న ప్రారంభమైన కౌన్సెలింగ్‌ శుక్రవారంతో ముగిసింది. ప్రారంభంలో పీజీ సీట్లు భారీగా మిగిలిపోయాయని భావించారు. ఆతర్వాత విద్యార్థుల హాజరుసంఖ్య పెరిగింది.  దీంతో అనుబంధ కళాశాలల యాజమాన్యాలకు ఊరట లభించింది. మొత్తం 3,403 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ప్రొఫెసర్‌ బీవీ రాఘవులు తెలిపారు. జూలై 8 నుంచి రెండో దఫా కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందన్నారు.

వెబ్‌ ఆప్షన్ల ఇవ్వడానికి ఆదివారం అర్ధరాత్రి వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.  ఎస్కేయూ క్యాంపస్‌ కళాశాలల్లో  అందుబాటులో 1,084 సీట్లు అందుబాటులో ఉండగా, అనుబంధ పీజీ కళాశాలల్లో 3,490 సీట్లు, మొత్తం 4,574 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో సర్టిఫికెట్ల పరిశీలనకు 3,403 మంది అభ్యర్థులు హాజరుకాగా 3,090 మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. వెబ్‌ ఆప్షన్లు ఇవ్వడానికి  2వతేదీ (1వతేదీ ఉన్నప్పటికీ ఒక రోజు పొడిగించారు)చివరి తేదీగా నిర్ణయించారు. రెండో దఫా కౌన్సెలింగ్‌ ఈనెల 8వతేదీ ప్రారంభం అవుతుంది.

Advertisement
 
Advertisement