ఈత మొక్కలకు ఐదు ఎకరాలు కేటాయించాలి | Sakshi
Sakshi News home page

ఈత మొక్కలకు ఐదు ఎకరాలు కేటాయించాలి

Published Sun, Jul 31 2016 9:32 PM

Five acres of land allotted to the plant in the swim

గౌడజన హక్కుల పోరాట సమితి నేత అశోక్‌గౌడ్‌
కౌడిపల్లి: ఈత మొక్కల పెంపకానికి ప్రతి గ్రామానికి 5 ఎకరాల చొప్పున స్థలం కేటాయించాలని గౌడ జనహక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం కౌడిపల్లికి వచ్చిన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చంద్రం దుర్గాగౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.

జీఓ నంబర్‌ 560 ప్రకారం ప్రతి గ్రామంలో ఈత వనాల పెంపకం కోసం 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలన్నారు. గౌడ జనహక్కుల పోరాట సమితి నర్సాపూర్‌ తాలూకా అధ్యక్షుడిగా సార రామాగౌడ్‌ను నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిం అశోక్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు చంద్రం దుర్గాగౌడ్‌ ప్రకటించారు. కార్యక్రమంలో నర్సాపూర్‌ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, సంఘం నాయకులు చంద్రాగౌడ్‌, చంద్రం కృష్ణాగౌడ్, సార శంకర్‌గౌడ్‌, సత్యనారాయణగౌడ్, వీరాగౌడ్‌,  సురేష్‌గౌడ్‌, రవీందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement
Advertisement