Sakshi News home page

వర్షంతో జూరాలకు వరద

Published Wed, Sep 14 2016 12:31 AM

flood to jurala

జూరాల : జూరాల ప్రాజెక్టు పరివాహాక ప్రాంతంలో స్థానికంగా కురుస్తున్న వర్షాల వల్ల  మంగళవారం 4500 క్యూసెక్కుల ఇన్‌ప్లో వరద వచ్చింది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.67 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా 450 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సమాంతర కాలువ ద్వారా 850 క్యూసెక్కులు, కొయిల్‌ సాగర్‌కు 630 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.  భీమా–1,2 పంపు హౌస్‌ల ద్వారా 2050 క్కూయసెక్కుల నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. కృష్ణా నదిపై కర్ణాటకలోని ఉన్న ఆల్‌మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 129.72 టీఎంసీలు. ప్రస్తుతం 122.48 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు పై నుంచి ఇన్‌ప్లో లేక పోవడంతో అవుట్‌ప్లో విడుదల చేయడం లేదు. ఆల్మమట్టి ప్రాజెక్టు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయపూర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 37.64 టీఎంసీలు. ప్రస్తుతం 23.89 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు పై నుంచి కేవలం 630 క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉంది. దీంతో ప్రాజెక్టు నుంచి నీటి విడుదల పూర్తిగా నిలిపేశారు.
 

Advertisement
Advertisement