వృక్షరాజాన్ని బతికించాలని.. | Sakshi
Sakshi News home page

వృక్షరాజాన్ని బతికించాలని..

Published Sat, Sep 17 2016 8:48 PM

యువకులు నిలబెట్టిన చెట్టుమ్రాను - Sakshi

వృక్షో రక్షతి రక్షితః.. అంటే చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని దీని అర్థం. అందుకే తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ యువకులు 120 సంవత్సరాల వయసున్న ఈ మర్రి చెట్టును బతికించేందుకు శనివారం తీవ్రంగా కృషి చేశారు. గ్రామంలోని రెడ్ల బజారు రామమందిరం సమీపంలో ఉన్న ఈ చెట్టు నేలకొరగడంతో ఉండవల్లి సెంటర్‌ నుంచి క్రేన్, పొక్లెయిన్‌ తెప్పించి చెట్టును తిరిగి అదే స్థానంలో భారీ గొయ్యి తీసి నిలబెట్టారు. బరువు తగ్గించేందుకు చెట్టు కొమ్మలు నరికేశారు.  అనంతరం మూడు ట్యాంకర్ల నీరు తెప్పించి నీళ్లు పోశారు. – ఉండవల్లి (తాడేపల్లి రూరల్‌)

Advertisement

తప్పక చదవండి

Advertisement