పండ్ల తోటలకు 40 శాతం రాయితీ | Sakshi
Sakshi News home page

పండ్ల తోటలకు 40 శాతం రాయితీ

Published Thu, Jul 28 2016 10:54 PM

Fruit groves, a 40 per cent discount

సుభాష్‌నగర్‌ : 
పండ్లు, పూల తోటల సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం 40 శాతం రాయితీపై మొక్కలను అందజేయనుందని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సునందారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఐడీహెచ్‌ పథకం కింద రాయితీ ఇస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో మామిడి 128 హెక్టార్లు, నిమ్మ 75 హెక్టార్ల, జామ 77 హెక్టార్లు, పెద్ద రేగు 58.5 హెక్టార్లు, దానిమ్మ 49.50 హెక్టార్లు, విడి పూలు 98.5 హెక్టార్లు, సీతాఫలం 41.5 హెక్టార్లలో సాగును ప్రోత్సహించడానికి రాయితీ ఇస్తున్నామని తెలిపారు. ప్రతి రైతుకు గరిష్టంగా నాలుగు ఎకరాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పళ్ల తోటలను సాగు చేసే రైతులకు బిందుసేద్యం పరికరాలనూ సబ్సిడీపై అందించనున్నామని తెలిపారు. ఇతర వివరాలకు ఆర్మూర్‌ నియోజకవర్గ రైతులు ఉద్యాన అధికారి వాహెద్‌ జుమా (83744 49351), బోధన్‌ రైతులు పండరి (8374449353), జుక్కల్‌ రైతులు మహీపాల్‌ (94406 60832), బాన్సువాడ రైతులు యాదగిరి (83744 49471), ఎల్లారెడ్డి రైతులు శేఖర్‌ (83744 49877), కామారెడ్డి రైతులు రాజు గౌడ్‌ (92965 08402), నిజామాబాద్‌ అర్బన్‌ రైతులు (83744 49352), నిజామాబాద్‌ రూరల్‌ రైతులు (98666 47855), బాల్కొండ రైతులు (83744 49361) నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement