క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం | Sakshi
Sakshi News home page

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

Published Thu, Oct 27 2016 11:07 PM

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

  • ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు
  • రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ జట్టు ఎంపిక
  • ఒంగోలు: క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, మనతో పాటు తోటివారిని కూడా ఆడేందుకు ప్రోత్సహించాలని ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ఏబీఎం జూనియర్‌ కాలేజీ ఆవరణలో జరిగిన బాక్సింగ్‌ క్రీడాకారుల ఎంపికకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం జిల్లా స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా రాణించేలా శిక్షణ పొందాలన్నారు.  ప్రకాశం జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొడ్డు సుబ్బారావు మాట్లాడుతూ ఎంపికచేసిన టీమ్‌ నవంబరు 3, 4, 5 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.  కార్యదర్శి పీ హృదయరాజ్, ఫిజికల్‌ డైరెక్టర్‌లు కే డేవిడ్‌రాజు, జీవన్‌జ్యోతి, పీ సుధాకర్, డీ రవిప్రసాద్‌  పాల్గొన్నారు. 
     
    క్రీడాకారుల వివరాలు
    పీ సురేశ్‌బాబు, వీ సాయినాగార్జున, జేవీ విష్ణువర్ధన్, వీ చరణ్‌ నాయక్, బీ దిలీప్, హరీష్‌బాబు నందన్, ఎంబీ చంద్రహరి (ఒంగోలు), సీహెచ్‌ సాయిచరణ్‌ (దర్శి), పీ వినీత్‌ (కొండపి), జీ అభినవ్‌ (కొప్పోలు), ఎం శివారెడ్డి (కొమరోలు), వై రవిచంద్రారెడ్డి (చీరాల), పీ కోటేశ్వరరావు (చీరాల), ఎస్‌ కృపానందం (మద్దిరాలపాడు). కోచ్‌గా పీ వేణు, మేనేజర్‌గా పీఎల్‌ రాజు వ్యవహరిస్తారు. 

Advertisement
Advertisement