పుష్కరాలకు పటిష్ట బందోబస్తు | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు పటిష్ట బందోబస్తు

Published Wed, Jul 20 2016 11:42 PM

పుష్కరాలకు పటిష్ట బందోబస్తు - Sakshi

– 180 సీసీ కెమెరాల ఏర్పాట్లు
– 24 గంటలు పెట్రోలింగ్‌
– పుష్కర రూట్లలో సూచిక బోర్డులు
– ఎస్పీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి


నల్లగొండ : కృష్ణా పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలతో నిర్వహించిన సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన బందోబస్తు చర్యలు, పార్కింగ్‌ తదితర అంశాలపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 120 కిలో మీటర్ల మేర కృష్ణానది ప్రవహిస్తుండడంతో 28 పుష్కరఘాట్లు పుణ్యస్థానాల కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాకు హైదరాబాద్‌   దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా భద్రత చర్యలు చేపట్టాలని సూచించారు. పుష్కరాలను 180 సీసీ కెమెరాలతో పరిశీలించేందుకు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 20 కిలోమీటర్లకు మొబైల్‌ పెట్రోలింగ్‌ పోలీస్‌ బృందాన్ని 24 గంటలు గస్తీ నిర్వహించాలన్నారు.

పుష్కరాల యాప్‌ను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.వాహనాల ద్వారా వచ్చే వారికి పుష్కర రూట్లు తెలిపేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. 6751 మంది పోలీసులతో భద్రత చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అంబులెన్స్‌లు, వైద్య సదుపాయం ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోటి 50 లక్షల మంది భక్తులు పుష్కర పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. వచ్చే, పోయే వాహనాలను వేర్వేరు రహదారుల్లో మళ్లించాలని, ప్రమాదాలు జరగకుండా మూలమలుపుల వద్ద సూచిక బోర్డుల ఏర్పాటు, విస్తరణ చర్యలు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఎఎస్పీ గంగారాం, డీయస్పీలు సుధాకర్, సునీతామోహన్, చంద్రమోహన్, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement