గ్రూప్‌-1 మెయిన్‌ పకడ్బందీగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-1 మెయిన్‌ పకడ్బందీగా నిర్వహించాలి

Published Wed, Aug 16 2017 10:19 PM

గ్రూప్‌-1 మెయిన్‌ పకడ్బందీగా నిర్వహించాలి

– అధికారులకు డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి ఆదేశం
- నేటి నుంచి రెండు కేంద్రాల్లో నిర్వహణ
- 17 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు


అనంతపురం అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో గ్రూప్‌–1 మెయిన్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్‌ఓ సి. మల్లీశ్వరిదేవి అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రోజుమార్చి రోజు జరుగుతాయన్నారు. పరీక్ష నిర్వహణపై కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏపీపీఎస్‌సీ అధికారులు, జిల్లా అధికారులతో  డీఆర్‌ఓ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 688 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్ష నిర్వహణకు ఒక లైజన్‌ అధికారి, ఇద్దరు అసిస్టెంట్‌ లైజన్‌ అధికారులను నియమించామన్నారు.

కేంద్రాల ప్రిన్సిపాళ్లు చీఫ్‌ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారన్నారు. ప్రశ్నాపత్రాలను జిల్లా ఖజానాలోని స్ట్రాంగ్‌ రూం నుంచి కేంద్రాలకు పోలీసు బందోబస్తుతో లైజన్‌ అధికారి తీసుకెళ్లాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్ష సమయంలో  కేంద్రం పరిసరాల్లో జిరాక్స్‌ సెంటర్లను బంద్‌ చేయించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులను కేంద్రంలోకి అనుమతించరాదన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికంటే కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని సూచించారు. సమావేశలో ఖజానా శాఖ డీడీ శర్మ, పర్యవేక్షకులు వరదరాజులు, నాగభూషణం, ఏపీపీఎస్‌సీ మానిటరింగ్‌ అధికారి బి.సి.హెచ్‌.ఎన్‌.కుమార్‌రాజ్, కోఆర్డినేటింగ్‌ అధికారులు జి.వసంతకుమార్, వి.సురేశ్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రాలు
కేంద్రం కోడ్‌    అభ్యర్థులు    పరీక్ష కేంద్రం    
4001    400    ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ కళాశాల    
4002    288    ఎస్‌ఎస్‌బీఎన్‌ జూనియన్‌ కళాశాల    

పరీక్ష తేదీలు    
పరీక్ష తేదీ    పేపర్‌    
17.08.17    జనరల్‌ ఇంగ్లిష్‌    
19.08.17    పేపర్‌–1    
21.08.17    పేపర్‌–2    
23.08.17    పేపర్‌–3    
26.08.17    పేపర్‌–4    
28.08.17    పేపర్‌–5

Advertisement
Advertisement