కన్నతండ్రే కాలువలో పడేశాడు | Sakshi
Sakshi News home page

కన్నతండ్రే కాలువలో పడేశాడు

Published Sat, Jun 3 2017 12:29 AM

Funeral costs can not bear ..

కాలువలో కొట్టుకొచ్చిన  మృతదేహం యువతిదే
ఉరేసుకుని చనిపోయాకతీసుకొచ్చి పడేశాడు
అంత్యక్రియల ఖర్చులు భరించలేకనే..!



రాజేంద్రనగర్‌: లక్షీగూడ ప్రాంతంలోని కాలువలో లభ్యమైన మృతదేహం కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఛేదించారు. ఎస్సై నాగాచారి తెలిపిన వివరాల ప్రకారం... లక్షీగూడ ప్రాంతానికి చెందిన పెంటయ్య తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. స్థానిక కంపెనీలో పని చేస్తున్నారు. గత 18 నెలల క్రితం కుమారుడు తులసీరామ్‌ ఆత్మహత్య చేసుకోవడంతో కూతురైన భవాని(16)తో కలిసి ఉంటున్నాడు. 7వ తరగతి చదివిన భవాని ఇంటి వద్దే ఉంటుంది. స్థానికంగా ఉన్న కొందరితో స్నేహం చేసి చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతోంది. గత 20 రోజుల కిత్రం కూడా భవాని ఒక సెల్‌ఫోన్‌ దొంగతనం చేసినట్టు తెలియడంతో అప్పట్నుంచి పెంటయ్య ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు. గత నెల 10న రాత్రి సమయంలో బయటకు వెళ్లి వచ్చింది.

దీంతో స్థానికులు మీ కూతురు అర్ధరాత్రి వేళ బయట తిరుగుతుందని పెంటయ్యతో చెప్పారు. అర్ధరాత్రి కావడంతో కూతుర్ని ఏమీ అనకుండా ఉదయమే లేచి  డ్యూటీకి వెళ్లాడు. తండ్రి మందలిస్తాడనే భయంతో 11న బాత్‌రూమ్‌లో ఉరేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం నుంచి వచ్చిన పెంటయ్య చూసి మృతదేహాన్ని స్థానికంగా ఉన్న నాలాలో పడవేశాడు. ఇప్పటికే లక్ష రూపాయల అప్పు ఉండడం.. మృతదేహానికి ఖననం ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తే మరింత అప్పు పెరుగుతుదని భావించి కాలువలో వేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. గత నెల 11న కాలువలో వేస్తే 31న ఉదయం కాలువ నుంచి పైపులైన్‌ ద్వారా భవానీ మృతదేహం బయటకు వచ్చింది.

కేసులో ఎలాంటి క్లూ లేకపోవడంతో పోలీసులు స్థానికంగా మిస్సింగ్‌  వివరాలను సేకరించారు. ఇందులో భాగంగా భవానీ కనిపించడం లేదని తెలపడంతో పెంటయ్యను పిలిపించి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement