క్రీడాభివృద్ధికి జెన్‌కో కృషి | Sakshi
Sakshi News home page

క్రీడాభివృద్ధికి జెన్‌కో కృషి

Published Sat, Oct 1 2016 12:00 AM

క్రీడాభివృద్ధికి జెన్‌కో కృషి

  • టీఎస్‌ జెన్‌కో డైరెక్టర్‌ సి.రాధాకృష్ణ
  • ఇంటర్‌ ప్రాజెక్ట్స్‌ క్రీడా విజేతలకు బహుమతులు అందజేత
  • పాల్వంచ : టీఎస్‌ జెన్‌కో విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు యాజమాన్యం ప్రత్యేకంగా కృషి చేస్తోందని జెన్‌కో డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌) సి.రాధాకృష్ణ అన్నారు. స్థానిక టీఆర్‌సీ ఇండోర్‌ స్టేడియంలో మూడు రోజులుగా సాగుతున్న టీఎస్‌ జెన్‌కో ఇంటర్‌ ప్రాజెక్ట్స్‌ క్రీడా పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. ఈ పోటీల్లో షటిల్‌ బ్యాడ్మింటన్‌ టీం ఈ వెంట్‌లో కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం ప్రథమ, కేటీపీపీ(భూపాలపల్లి) ద్వితీయ, కేటీపీఎస్‌ 5వ దశ తృతీయ స్థానంలో నిలిచాయి. క్యారమ్స్‌ టీం ఈ వెంట్‌లో విద్యుత్‌ సౌధ (హైదరాబాద్‌) ప్రథమ, కేటీపీపీ ద్వితీయ, కేటీపీఎస్‌ 5వ దశ తృతీయ, టెన్నికాయిట్‌ టీం ఈవెంట్‌లో కేటీపీఎస్‌ 5వ దశ ప్రథమ, కేటీపీపీ ద్వితీయ, కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం తృతీయ, చెస్‌లో కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం ప్రథమ, కేటీపీఎస్‌ 5వ దశ ద్వితీయ, శ్రీశైలం తృతీయ, టేబుల్‌ టెన్నిస్‌లో కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం ప్రథమ, కేటీపీపీ ద్వితీయ, విద్యుత్‌ సౌధ తృతీయ, టేబుల్‌ టెన్నిస్‌ పురుష విభాగంలో కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం ప్రథమ, కేటీపీఎస్‌ 5వ దశ ద్వితీయ, కేటీపీపీ తృతీయ స్థానాల్లో నిలిచాయి. మహిళా క్రీడల్లో సీహెచ్‌.అనంత లక్ష్మి చాంపియన్‌షిప్‌ సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలకు ట్రోఫీలను డైరెక్టర్‌ రాధాకృష్ణ అందజేశారు. ఈ పోటీలకు కె.హిజ్కియరాజ్, బి.వీరునాయక్, వి.జాకబ్, ఎస్‌కె.సోందు, బి.సత్యనారాయణ, ఎన్‌.వెంకటేశ్వర్లు, వంశీ, వెంకట్‌ రిఫరీలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో సీఈలు వి.మంగేష్‌కుమార్, పి.రత్నాకర్, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ లోహిత్‌ ఆనంద్, వై.వెంకటేశ్వర్లు, డి.సారయ్య, నరసింహారావు, అనుమంతరామ పాల్గొన్నారు.

    (30కెజిఎం272) : అనంతలక్ష్మికి ట్రోఫీ అందిస్తున్న డైరెక్టర్‌ రాధాకృష్ణ
    (30కెజిఎం273) : విజేతలకు బహుమతులు అందిస్తున్న రాధాకృష్ణ

Advertisement
Advertisement