జియోట్యాంగింగ్ చేయాలి | Sakshi
Sakshi News home page

జియోట్యాంగింగ్ చేయాలి

Published Mon, Aug 29 2016 10:54 PM

geaotaging compulsary

ముకరంపుర : హరితహారంలో భాగంగా వివిధ శాఖల ద్వారా జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కలన్నింటికీ వెంటనే జియోట్యాగింగ్‌ చేయాలని కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులతో హరితహారంపై సమీక్షించారు. నాటిన మొక్కలన్నింటికీ రిజిస్టర్‌ చేయాలని, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. మొక్కలను స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఫొటో తీసి జియోట్యాగింగ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్‌ విధానంపై బుధవారం సాయంత్రం 4 గంటలకు శిక్షణ ఏర్పాటు చేస్తున్నామని, అన్ని శాఖల అధికారులు తమ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను శిక్షణకు పంపించాలని ఆదేశించారు. 

Advertisement
Advertisement