ఎన్‌ఎస్‌ఐజీఎస్‌ఈ స్కాలర్‌షిప్‌నకు బాలికలు అర్హులు | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఐజీఎస్‌ఈ స్కాలర్‌షిప్‌నకు బాలికలు అర్హులు

Published Sun, Aug 7 2016 12:20 AM

girls are eligible for NSIGS scholarships

విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీ బీవీ, మోడల్‌స్కూల్, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 2016– 17 విద్యాసంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ బాలికలు నేషనల్‌ ఇన్సింటివ్‌ టూ గర్‌్ల్స ఫర్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ (ఎన్‌ఎస్‌ఐజీఎస్‌ఈ) స్కాలర్‌షిప్‌కు అర్హులని డీఈఓ పి.రాజీవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు చేయించాలన్నారు. ఇందుకోసం విద్యార్థినులకు బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్, ఆధార్‌ నంబర్‌ తప్పనిసరిగా అవసరం ఉం టుందన్నారు. కేజీబీవీల్లో చదువుతున్న అందరు బాలికలు (కులంతో సంబంధం లేకుండా) అర్హులన్నారు.  ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాలన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఈఓవరంగల్‌.నెట్‌లో ఇందుకు సంబంధించిన లింకును సమకూర్చాన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.స్కాలర్‌షిప్‌.గౌట్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు విధిగా విద్యార్థులకు సంబంధించిన దరఖాస్తులు సమర్పించాలన్నారు. 

Advertisement
Advertisement