కలెక్టరేట్‌కు రాజమహల్‌ ఇవ్వండి | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌కు రాజమహల్‌ ఇవ్వండి

Published Wed, Sep 21 2016 12:13 AM

give the rajmahal to collectorate

వనపర్తి : మరో 20రోజుల్లో జిల్లా కేంద్రంగా ఆవిర్భవించనున్న వనపర్తిలో కలెక్టరేట్‌ ఏర్పాటుకు రాజమహల్‌ భవనం కావాలని రాణి శంకరమ్మ ట్రస్టుకు కలెక్టర్‌ టీకే శ్రీదేవి లేఖ రాశారు. దీనిని మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ద్వారా ట్రస్టు నిర్వాహకులకు అందజేశారు. ఇదివరకే డీఆర్‌ఓ భాస్కర్‌ ఈ భవంతిని పరిశీలించిన విషయం విదితమే. దీంతో సుమారు 70ఏళ్ల క్రితం రాజసంతో వెలుగొందిన వనపర్తి సంస్థానా«ధీశుల రాంసాగర్‌ బంగ్లాకు పూర్వవైభవం రానుంది. ఇందుకు వనపర్తి సంస్థానాధీశుల వారసులైన కష్ణదేవరావు, ట్రస్టు నిర్వాహకులు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. 
 
పాలిటెక్నిక్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు  
ప్రస్తుతం రాజమహల్‌లో కొనసాగుతున్న పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాల నిర్వహణకు ప్రత్యామ్నాయ భవనాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. పాలిటెక్నిక్‌ కళాశాలకు సంబంధించి కొన్ని తరగతులకు మాత్రమే ఇక్కడ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాల బంగ్లా గ్రౌండ్‌ఫ్లోర్‌లో అలాగే ఉంచుతూ.. మొదటి, రెండో అంతస్తుల్లో కలెక్టర్‌ కార్యాలయం ఏర్పాటుచేసే అవకాశముంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement