గోదావరి వరద తగ్గుముఖం | Sakshi
Sakshi News home page

గోదావరి వరద తగ్గుముఖం

Published Fri, Sep 30 2016 10:23 PM

గోదావరి వరద తగ్గుముఖం

కొవ్వూరు : గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతంలో నీటి మట్టాలు క్రమేణా తగ్గుతున్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 5,46,150 క్యూసెక్కులున్న ఇన్‌ఫ్లో సాయంత్రం ఆరు గంటలకు 4,30,682 క్యూసెక్కులకు తగ్గింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 5,800 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. మిగిలిన 4,24,882 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 ఎగువున భద్రచలంలో గురువారం సాయంత్రం ఆరుగంటలకు 35.40 అడుగులుగా ఉన్న నీటిమట్టం 30.50 అడుగులకు తగ్గింది. ఇప్పటి వరకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గేట్లు పూర్తిగా ఎత్తివేసిన అధికారులు వరద తీవ్రత తగ్గడంతో గేట్లు నియంత్రణలో పెట్టారు. ధవళేశ్వరం ఆర్మ్‌ వద్ద ఉన్న 70 గేట్లలలో 30 గేట్లను అరమీటరు ఎత్తు, 40 గేట్లను మీటరు ఎత్తులేపారు. ర్యాలీలో 43, మద్దూరులోని 23 గేట్లును 1.50 మీటర్లు ఎత్తు, విజ్జేశ్వరం ఆర్మ్‌లోని 39 గేట్లును మీటరు ఎత్తులేపి వరద నీటిని గోదావరి నుంచి సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. పశ్చిమ డెల్టాకి శుక్రవారం సాయంత్రం నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. ఏలూరు కాలువకు 379, నరసాపురం కాలువకు 304,, జీఅండ్‌వీ కాలువకు  231, అత్తిలి కాలువకు 204 క్యూసెక్కుల చొప్పున నీటిని విడిచిపెడుతున్నారు. ఉండి కాలువకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement