కీళ్ల మార్పిడి పద్ధతులపై గోసుల ఫెలోషిప్‌ | Sakshi
Sakshi News home page

కీళ్ల మార్పిడి పద్ధతులపై గోసుల ఫెలోషిప్‌

Published Sat, Sep 3 2016 5:48 PM

కీళ్ల మార్పిడి పద్ధతులపై గోసుల ఫెలోషిప్‌ - Sakshi

కడప కార్పొరేషన్‌:
కీళ్లమార్పిడిలో ఆధునిక పద్ధతులపై ప్రముఖ కీళ్లమార్పిడి వైద్యనిపుణులు డాక్టర్‌ గోసుల శివభారత్‌రెడ్డి అమెరికాలో ఫెలోషిప్‌ పూర్తి చేశారు. గత మాసంలో యూఎస్‌ఏకు చెందిన మ్యాక్స్‌ అర్థోపెడిక్స్‌ వా ఆహ్వానం మేరకు అమెరికాకు వెళ్లిన ఆయన కీళ్లమార్పిడిలో నూతన అధ్యాయాలు, నూతన పరికరాలు, టెక్నాలజీ తదితర వాటిపై అధ్యయనం చేశారు. అమెరికాలో ప్రముఖ కీళ్లమార్పిడి వైద్యనిపుణులైన డాక్టర్‌ బెకర్‌ బృందంతో కలిసి లాన్‌చెస్టర్‌ జనరల్‌ హాస్పిటల్‌లో,  డాక్టర్‌ ఆలమ్‌ వైద్య బృందంతో కలిసి మారిలాండ్‌లోని హోలి క్రాస్‌ హాస్పిటల్‌లో, డాక్టర్‌ శ్రీధర్‌ వైద్యబృందంతో కలిసి వాషింగ్టన్‌లోని  అడ్‌వెంటిస్ట్‌ హాస్పిటల్‌లో , ఫ్లోరిడాలో బెనార్త్‌ వెస్ట్‌ ఆఫ్‌ హాస్పిటల్‌లో, అమెరికాలో ప్రసిద్ది చెందిన యూనివర్సిటీ అయిన జాన్‌ హాఫ్‌కిన్స్‌లో ఈ ఫెలోషిప్‌ పూర్తి చేశారు. అనంతరం డాక్టర్‌ బెకర్‌ చేతుల మీదుగా  గోసుల శివభారత్‌రెడ్డి ఫెలోషిప్‌ సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ గోసుల మాట్లాడుతూ కీళ్లమార్పిడిలో నూతన పద్దతులపై అమెరికాలో ఫెలోషిప్‌ తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. తాను నేర్చుకొన్న నూతన పద్దతులు, అత్యాధునికమైన వైద్యసేవలను రాయలసీమ ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
 

Advertisement
Advertisement