సినీ పరిశ్రమకు సర్కారు అండ | Sakshi
Sakshi News home page

సినీ పరిశ్రమకు సర్కారు అండ

Published Sat, Sep 24 2016 11:56 PM

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి  తలసాని, చిత్రంలో నవీన్‌ మిట్టల్, రామోజీరావు - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకలుగా తోడ్పాటునందిస్తోందని రాష్ట్ర సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఇండివుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన తలసాని మట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆన్‌లైన్‌ టికెటింగ్,  సినిమా చిత్రీకరణ అనుమతులకు సింగిల్‌ విండో విధానాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఇండివుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌ వ్యవస్థాపక చైర్మన్‌ చౌహన్‌ రాయ్‌ మాట్లాడుతూ...వచ్చే ఐదేళ్లలో ప్రపంచ సినీ పరిశ్రమను భారతదేశ సినీ రంగం శాసిస్తుందన్నారు. రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు, ఐఅండ్‌ పీఆర్‌ కమిషనర్‌  నవీన్‌ మిట్టల్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement
Advertisement