అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం: మోత్కుపల్లి | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం: మోత్కుపల్లి

Published Sun, Jul 24 2016 12:40 AM

అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం: మోత్కుపల్లి - Sakshi

తుర్కపల్లి :  ప్రజల కిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జేఎం పంక్షన్‌హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ  ప్రభుత్వం మూడేళ్లు గడుస్తున్న రైతులకు రుణమాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు.  ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. హరితహారం పేరుతో రూ. కోట్లు   ఖర్చు చేస్తూ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మొక్కలు నాటడంలో చూపుతున్న శ్రద్ధ వాటిని రక్షించడంలో చూపడం లేదని తెలిపారు.  పేదలకు డబుల్‌ బెడ్‌రూంల ఇళ్లు, దళితులకు మూడెకరాలు, కేజీ టు పీజీ విద్య, ఇంటికో ఉద్యోగం, కరెంట్‌ సబ్సీడీ, వంటి పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తుర్కపల్లి మండలంలో విలువైన ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతుందని ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని కోరారు.  కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, తెలంగాణ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి రామచంద్రారెడ్డి, జిల్లా నాయకులు వనందాస్‌ పాపయ్య, కళాశికం అమరేందర్, రఘు, సంజీవ, అమర్‌నా«ద్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement