రైతుల అభివృద్ధే ధ్యేయం | Sakshi
Sakshi News home page

రైతుల అభివృద్ధే ధ్యేయం

Published Mon, Oct 3 2016 10:40 PM

రైతుల అభివృద్ధే ధ్యేయం - Sakshi

మోత్కూరు: 
రైతుల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ప్రభుత్వ విఫ్‌ గొంగిడి సునీత అన్నారు. సోమవారం జరిగిన మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి  హాజరై ప్రసంగించారు. రైతులు దోపిడీకి గురికాకుండా దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు మార్కెటింగ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా రైతులు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి  గోదాంల నిర్మాణాలు చేపట్టిందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కృషి వల్లే జిల్లాకు 12  గోదాంలు మంజూరైనట్లు తెలిపారు.  గందమల్ల రిజర్వాయర్‌తో మోత్కూరు ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు.  భీమలింగం, బునాదిగాని కాల్వల నిర్మాణం కోసం రీడిజైన్‌కు సీఎం రూ. 100 కోట్లు కేటాయించారని, త్వరలో పూర్తి కానున్నాయన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలతో నల్లగొండ ఫ్లోరైడ్‌ రహిత జిల్లాగా మారనుందని వివరించారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీలైనంతవరకు అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్‌ ఆవిశ్రాంతంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు.  అనంతరం మార్కెట్‌ కమిటీ  చైర్మన్‌ చిప్పలపెల్లి మహేంద్రనాథ్‌ , వైస్‌ చైర్మన్‌ లాగ్గాని రమేష్, డెరైక్టర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు, ఆత్మకూరు, గుండాల మండలాల ఎంపీపీలు ఓర్సులక్ష్మి, భాగ్యశ్రీ, సంగి వేణుగోపాల్, జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ ఎం.పాండురంగారావు, సింగిల్‌విండో చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడి, సర్పంచ్‌ బయ్యని పిచ్చయ్య, ఎంపీటీసీలు జంగ శ్రీను, కురిమిళ్ల ప్రమీళ, ముద్దం జయశ్రీ, జిల్లా పశు గణాభివృద్ధి సంఘం చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి, మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర ఎం.ఎ. అలీమ్, కార్యదర్శి ఉమామహేశ్వర్‌రావు, మార్కెట్‌ కమిటీ మాజీచైర్మన్‌ టి.మేఘారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు కొణతం యాకుబ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement