Sakshi News home page

కనుల పండువగా వైకుంఠ ఏకాదశి

Published Mon, Jan 9 2017 10:47 PM

కనుల పండువగా వైకుంఠ ఏకాదశి

ఆలయాల్లో భక్తులు కోలాహలం
నిర్మల్‌(మామడ) : వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. మండలంలోని పొన్కల్‌ శ్రీ లక్ష్మి వేంకటేశ్వరాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్  గంగాధర్, భక్తులు హరీశ్‌కుమార్, గంగారెడ్డి, భూమేశ్వర్, హన్మంత్‌రావులు పాల్గొన్నారు.

దిలావర్‌పూర్‌ : స్థానిక రామాలయంతో పాటు అత్యంత ప్రాచీన ప్రాశస్త్యంగల మండలంలోని కదిలి పరిసర అటవీప్రాంతంలోని పాపహేశ్వరాలయంలో, కాల్వ పరిసర అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీలక్షీ్మనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో స్థానిక సర్పంచ్‌ నంద అనిల్, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ధనె నర్సయ్య, వీడీసీ నాయకులు ధనె రవి, గుణవంత్‌రావు, ఉమాశంకర్, ఎస్‌ఎంసీ చైర్మన్ నందముత్యం, సప్పలరవి, కదిలిలో మాజీ చైర్మన్  నార్వాడి సంభాజీరావుపాటిల్, నాయకులు యన్ .భుజంగ్‌రావు, భూమేశ్, నాగభూషణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement