గ్రీన్‌క్యాంపస్‌గా తీర్చిదిద్దుదాం | Sakshi
Sakshi News home page

గ్రీన్‌క్యాంపస్‌గా తీర్చిదిద్దుదాం

Published Thu, Aug 4 2016 10:44 PM

గ్రీన్‌క్యాంపస్‌గా తీర్చిదిద్దుదాం

ఏయూక్యాంపస్‌: విశ్వవిద్యాలయ సుందరీకరణలో వక్షశాస్త్ర విభాగ విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఉదయం విభాగంలో నిర్వహించిన ఫ్రెషర్స్‌డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ వర్సిటీలో ప్రధాన ప్రవేశ మార్గాలు, కూడళ్లవద్ద పచ్చదనం పరిచే కార్యక్రమానికి అవసరమైన సూచలను అందించాలని సూచించారు. హార్చికల్చర్, లాండ్‌స్కేప్‌ మేనేజ్‌మెంట్‌ విభాగ విద్యార్థులు నిర్ధిష్ట ప్రణాళికతో రావాలని వీటిని అమలు చేస్తామన్నారు. విద్యార్థులు ప్రత్యక్ష జ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చేయాలన్నారు. విద్యార్తి ప్రవర్తన, వ్యక్తిత్వం వర్సిటీ ఉన్నతిపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సి.వి రామన్,విద్యార్థి సమన్వయాధికారిణి ఆచార్య అరుంధతి ,బిఓఎస్‌ చైర్మన్‌ ఆచార్య ఓ.అనీల్‌ కుమార్, విభాగాధిపతి ఆచార్య వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement