జీఎస్‌టీపై అవగాహన పెంచుకోవాలి | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీపై అవగాహన పెంచుకోవాలి

Published Sat, Nov 5 2016 11:10 PM

జీఎస్‌టీపై అవగాహన పెంచుకోవాలి

  • సెంట్రల్‌ ఎక్సైజ్, సర్వీస్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ ఖాదర్‌ రెహమాన్‌
  • ఒంగోలు సబర్బన్‌: గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌(జీఎస్‌టీ)పై వ్యాపారులు, డీలర్లు పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని కస్టమ్స్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ ఖాదర్‌ రెహమాన్‌ పిలుపునిచ్చారు. స్థానిక రంగారాయుడు చెరువు వద్ద  ఫ్యాన్సీ గూడ్స్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ హాలులో శనివారం జీఎస్‌టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఖాదర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం ఒకే పన్ను విధానాన్ని అమలు చేసి దానికి జీఎస్‌టీ అని పేరుపెట్టిందన్నారు.
     
      డిప్యూటీ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి సదస్సుకు హాజరై జీఎస్‌టీకి సంబంధించి వివరించారు.  సేల్స్‌ ట్యాక్స్‌ ఆడిటర్‌ కృష్ణ మోహన్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు దేవతు శ్రీరాములు, కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఆడిటర్‌ నాగరాజు సర్వీస్‌ ట్యాక్స్‌ సూపరింటెండెంట్లు వెంకట్రామయ్య, హుస్సేన్‌తో పాటు నగరంలోని అన్ని వ్యాపారాలకు సంబంధించిన వ్యాపారులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement