Sakshi News home page

గల్ఫ్‌ ఏజెంట్‌ మోసం

Published Fri, Sep 9 2016 11:28 PM

గల్ఫ్‌ ఏజెంట్‌ మోసం - Sakshi

కామారెడ్డి : పట్టణంలోని అశోక్‌నగర్‌ ప్రధాన రోడ్డులో కార్యాలయాన్ని నిర్వహిస్తూ గల్ఫ్‌ ఏజెంట్‌గా చెలామణి అయిన దోమకొండ మండలానికి చెందిన ఒకరు 60 మందిని మోసగించిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మంది నుంచి గల్ఫ్‌ దేశాలకు పంపించేందుకు రూ. 40 లక్షల వరకు వసూలు చేశాడు. ఏడాది కాలంగా ఏజెంట్‌ చుట్టూ తిరిగిన   బాధితుల్లో 16 మందిని రష్యా దేశానికి పంపించాడు. అక్కడ ఎన్నో ఇబ్బందులు పడి వెనుదిరిగిన బాధితులు ఏజెంట్‌ను నిలదీయగా డబ్బులు ఇస్తానని మభ్యపెట్టాడు. చివరకు ఐపీ నోటీసులు పంపించడంతో బాధితులు లబోదిబోమన్నారు. శుక్రవారం కామారెడ్డి కోర్టుకు హాజరైన బాధితులంతా తమ గోడును వెల్లబోసుకునేందుకు డీఎస్పీ కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడ డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తమ సమస్యను విన్నవించారు. బాధితుల వద్ద ఉన్న ఆధారాలతో ఏజెంట్‌పై కేసునమోదు చేస్తామని సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement