బాసరలో గురుపౌర్ణమి వేడుకలు | Sakshi
Sakshi News home page

బాసరలో గురుపౌర్ణమి వేడుకలు

Published Tue, Jul 19 2016 11:18 PM

బాసరలో గురుపౌర్ణమి వేడుకలు - Sakshi

  • జ్ఞాన ప్రదాత.. సరస్వతీ మాత
  • ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య
  • వేద పండితులు, కళాకారులు, సాహితీ వేత్తలకు సన్మానం
  • బాసర : సకల జనులకూ జ్ఞానాన్ని అందించే ప్రదాత.. సరస్వతీ మాత అని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ అక్షర భ్యాస మండపంలో మంగళవారం గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ప్రధాన ఆలయాలకు చెందిన సుమారు 140 మంది వేద పండితులు, అర్చకులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. వీరికి ఒక్కొక్కరికి రూ.1000 నుంచి రూ.5,100 వరకు నగదు పురస్కారాన్ని దేవాదాయ, «దర్మాదాయ ఆధ్వర్యంలో అందజేశారు. అంతకుముందు ముథోల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, డీఆర్‌డీ అరుణకుమారి హాజరై పండితులకు సన్మానం చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
    గురువుల సేవలు మరిపోలేనివి
    గురుపౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన వేద పండితులు, అర్చకులు ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. గురువుల సేవలను ఏ శిష్యుడూ మరచిపోలేరని పేర్కొన్నారు.
    ముగిసిన యజ్ఞం
    ఉత్సవాల ప్రారంభం రోజు నుంచి జరుగుతున్న మహాచండీ యాగం మంగళవారం ముగిసింది. పూర్ణాహుతితో వేద పండితులు యజ్ఞాన్ని ముగింపు పలికారు. ముగింపు ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డితోపాటు ప్రముఖ విద్యావేత్త, చుక్కా రామయ్య పాల్గొన్నారు.
    కళాకారులకు సన్మానం
    గురుపౌర్ణమిని పురస్కరించుకొని సన్మానం పొందిన వారిలో పలువురు ప్రముఖ కళాకారులు ఉన్నారు. 800కు పైగా సినిమాల్లో, సీరియల్స్‌లో వివిధ పాత్రల్లో నటించిన మహంకాళి బాలగంగాధర్‌ తిలక్, కర్ణాటక సంగీత విద్వాంసులు రామకష్ణ సన్మానం పొందారు. వీరితోపాటు ్రప్రముఖ రచయిత, తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు, ప్రిన్సిపాల్‌ ఆచార్య పి.కనకయ్య, ఇదే శాఖ సహాయ ఆచార్యులు, తెలంగాణ సాహిత్య పరిశోధకులు డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి, బాసరకు చెందిన రిౖటñ ర్ట్‌ ఉపాధ్యాయుడు నరసింహాచారి, వేదపండితులు నాగేశ్వర శర్మ, నటేశ్వర శర్మ తదితరులను శాలువాతో సత్కరించారు. నగదు పురస్కారాలు అందజేశారు.
    ఈ ముంగిపు ఉత్సవ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ అనూషాసాయిబాబా, జెడ్పీటీసీ లక్ష్మీనర్సాగౌడ్, సర్పంచ్‌ శైలజ సతీశ్వర్‌రావు, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు గెంటెల శ్యాంసుందర్, భూదేవి, ముథోల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, డైరెక్టర్‌ హన్మంతరావు, వైస్‌ చైర్మన్‌ రమేశ్, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ నూకం రామారావు, ముథోల్‌ సీఐ రఘుపతి, ట్రైనీ ఎస్సై టి.మహేశ్, టీఆర్‌ఎస్‌ నాయకులు బాల్గం దేవేందర్, జగ్గం మల్కన్న, బాల మల్కన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement