హంద్రీ నుంచి శ్రీశైలానికి వరద | Sakshi
Sakshi News home page

హంద్రీ నుంచి శ్రీశైలానికి వరద

Published Thu, Sep 1 2016 12:10 AM

handri water to srisailam

శ్రీశైలం ప్రాజెక్టు: గత రెండు రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో హంద్రీ నుంచి శ్రీశైలానికి 700 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. అలాగే జూరాల ప్రాజెక్టు నుంచి 16వేల క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి విడుదలవుతోంది. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో డిమాండ్‌కు అనుగుణంగా పీక్‌లోడ్‌ అవర్స్‌లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రెండు జనరేటర్లతో ఉత్పత్తి చేసి నిలిపేశారు. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 3,500 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,680 క్యూసెక్కుల నీటిని జలాశయం నుంచి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 151.1449 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 872.20 అడుగులకు చేరుకుంది.
 

Advertisement
Advertisement