కాళేశ్వరం, డిండిలతో నీళ్లిస్తాం | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం, డిండిలతో నీళ్లిస్తాం

Published Tue, May 10 2016 1:44 AM

కాళేశ్వరం, డిండిలతో నీళ్లిస్తాం - Sakshi

జిల్లాకు మూడు కొత్త రైతు బజార్లు
నాలుగు నూతన వూర్కెట్ కమిటీల ఏర్పాటు
కాళేశ్వరం, డిండి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు
మేడ్చల్ వూర్కెట్ కమిటీ ప్రవూణస్వీకారోత్సవంలో
భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లా తూర్పు డివిజన్‌కు, పాలవుూరు -డిండి ప్రాజెక్టుతో జిల్లాలోని పశ్చివు ప్రాంతానికి నీళ్లిస్తాం. సస్యశ్యావులం చేస్తాం. ‘కాళేశ్వరం’తో మేడ్చల్ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.  - మంత్రి హరీష్‌రావు

 మేడ్చల్ : కరువుతో అల్లాడుతున్న రంగారెడ్డి జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని కాళేశ్వరం పాలవుూరు - డిండి ప్రాజెక్టుల ద్వారా సస్యశ్యావులం చేస్తావుని వుంత్రి హరీష్‌రావు అన్నారు. సోవువారం కండ్లకోయులోని వూర్కెట్ కమిటీ కార్యాలయు ఆవరణలో నిర్వహించిన మేడ్చల్ వూర్కెట్ కమిటీ పాలక వర్గ ప్రవూణస్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తావుని అన్నారు. గోదావరి జలాల ద్వారా నగర శివార్లలోని చెరువులను నింపడం వల్ల తాగునీటి సవుస్య తీరుతుందన్నారు. ప్రభుత్వం నాయుకులపై నవ్ముకంతో వూర్కెట్ కమిటీ పదవులను అప్పగించిందని, వారి సేవలో ఉంటూ ప్రభుత్వానికి వారధిలా ఉండాలన్నారు. 

 త్వరలో నూతన రైతుబజార్లు
త్వరలోనే పరిగి, తాండూరు, చేవెళ్లలలో నూతన రైతుబజార్లు ఏర్పాటు చేస్తావుని వుంత్రి హరీష్‌రావు అన్నారు. గతంలో జిల్లాలో 11 వూర్కెట్ కమిటీలు ఉండగా వురో 4 నూతన వూర్కెట్ కమిటీలను ఏర్పాటు చేసి వాటి సంఖ్యను 15కు పెంచావున్నారు. మేడ్చల్ పట్టణంలో త్వరలోనే కూరగాయు వూర్కెట్ ఏర్పాటు చేస్తావుని హామీ ఇచ్చారు.

 మేడ్చల్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయూలి : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
రింగురోడ్డు వెంబడి ఉన్న వుండలాలను కలుపుతూ మేడ్చల్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వుంత్రి హరీష్‌రావును ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కోరారు. మిషన్ భగీరథలో నెలాఖరులోపు ఇంటింటికీ గోదావరి నీటిని పంపిణీ చేస్తామన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని మొదటగా మేడ్చల్ నియోజకవర్గంలోనే ప్రారంభిస్తానని సీఎం కే సీఆర్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

 అట్టహాసంగా ప్రమాణస్వీకారం..
మేడ్చల్ వూర్కెట్ కమిటీ పాలకవర్గ ప్రవూణ స్వీకారం కార్యక్రవూన్ని సోవువారం అట్టహాసంగా నిర్వహించారు. వూర్కెట్ కమిటీ కార్యాలయు ఆవరణలో వుంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, వుంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, జిల్లా నాయకుల సవుక్షంలో పాలకవర్గం ప్రవూణస్వీకారం చేసింది. మార్కెట్‌యార్డు చైర్మన్‌గా మేడ్చల్‌కు చెందిన సత్యనారాయుణ, వైస్ చైర్మన్‌గా శామీర్‌పేట్‌కు చెందిన నాగరాజు, డెరైక్టర్లుగా లింగా కృష్ణవుూర్తి, రాధిక, కండ్లకోయు సర్పంచ్ నరేందర్‌రెడ్డి, సంతోష్‌కువూర్, అంజయ్యుగౌడ్, నర్సింహారెడ్డి, వుుత్యం రెడ్డి,రాజేంద్రప్రసాద్, యుుద్దంరెడ్డి, కీసర పీఏసీఎస్ చైర్మన్, మేడ్చల్ ఏడీఏ శోభారాణి, మేడ్చల్ వూర్కెటింగ్ శాఖ ఏడీఏలతో వూర్కెటింగ్ శాఖ డీడీ వుల్లేశం ప్రవూణం చేరుుంచారు.

ఈ సందర్భంగా పాలకవర్గం నాయకులను సన్మానించింది. అంతకుముందు వూర్కెట్ కమిటీ ఆవరణలో వుంత్రి, ఎమ్మెల్యేలు, నాయుకులు మొక్కలు నాటారు. కార్యక్రవుంలో వూర్కెటింగ్ శాఖ జేడీ రవికువూర్, జిల్లా ఏడీ చాయూదేవి, ఈఈ రావూరావు, డీఈ లక్ష్మణ్‌దాస్, వూర్కెట్ కమిటీ కార్యదర్శి అపర్ణ, ఎంపీపీలు విజ యులక్ష్మి, సుజాత, శ్రీనివాస్‌గౌడ్, చంద్రశేఖర్‌యూదవ్, జెడ్పీటీసీలు శైలజ, సం జీవరెడ్డి, టీఆర్‌ఎస్ నాయుకులు భా స్కర్‌యూదవ్, నందారెడ్డి, వుల్లిఖార్జున్‌స్వా మి, విష్ణుగౌడ్, జహంగీర్, నాయుకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 ‘మిషన్ కాకతీయ’కు ప్రశంసలు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
మేడ్చల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయుకు ప్రపంచ దేశాల నుంచి ప్రశంశలు అందుతున్నాయని భారీ నీటి పారుదల శాఖ వుంత్రి హరీష్‌రావు అన్నారు. వుండలలోని అర్కల్‌గూడలోని కోవుటికుంట చెరువులో మిషన్ కాకతీయు పనులను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వూట్లాడుతూ నీటి సవుస్య అధిగమించేందుకు గత ప్రభుత్వాలన్నీ విఫలయత్నాలు చేశాయన్నారు. కానీ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సహజ వనరులను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువుల విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని మిషన్ కాకతీయును చేపట్టిందన్నారు. నీతి అయోగ్, కేంద్ర వుంత్రి ఉవూభారతి, రాష్ట్ర హైకోర్టు, వ్యూక్సెక్ అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌లు మిషన్ కాకతీయు పథకాన్ని ప్రశంసించారన్నారు. ఈ పథకంపై అధ్యయనానికి చికాగో, మిచ్చిగాన్ యుూనివర్సిటీలు, పలు సంస్థలు తమను కలిసి అనుమతులు కోరుతున్నాయన్నారు. ఇలాంటి గొప్ప పథకాన్ని ప్రతి పౌరుడు సావూజిక బాధ్యతగా భావించి విజయువంతం చేయూలని కోరారు. మిషన్ కాకతీయు రెండో దశ పనులకు ప్రభుత్వం రూ.17 కోట్లు వుంజూరు చేసిందన్నారు. వేసవిలో సైతం ప్రతీ ఇంటికి, పరిశ్రవులకు 24 గంటల కరెంట్ అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.

Advertisement
Advertisement