సింగరేణిలో ప్రతిష్టాత్మకంగా హరితహారం | Sakshi
Sakshi News home page

సింగరేణిలో ప్రతిష్టాత్మకంగా హరితహారం

Published Tue, Jul 19 2016 11:35 PM

harithaharam is prastage of singareni

  • సీజీఎం వెంకటేశ్వర్‌రావు
  • గోదావరిఖని : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహారం రెండవ దశలో భాగంగా సింగరేణి సంస్థ రామగుండం ఏరియా–1 ఆధ్వర్యంలో ముస్త్యాల వెళ్లే రహదారి పక్కన మంగళవారం పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్జీ–1 సీజీఎం సీహెచ్‌.వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు విడుతలుగా మొక్కలను నాటామని, మంగళవారం 3 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తంగా 4,97,300 మొక్కలను ఆర్జీ–1 ఏరియాలో నాటామన్నారు. పర్యావరణ అధికారి అంబటి శ్రీనివాస్‌ పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు.
    కార్యక్రమంలో పర్సనల్‌ డీజీఎం బి.హనుమంతరావు, మేడిపల్లి ఓసీపీ ప్రాజెక్టు ఆఫీసర్‌ నాగేశ్వర్‌రావు, సివిల్‌ డీజీఎం సూర్యనారాయణ, డీజీఎం సాయిరాం, పర్సనల్‌ మేనేజ ర్‌ ఎం.శ్రీనివాస్, సీఎంఓఏఐ ప్రధాన కార్యదర్శి రమేశ్, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ డెప్యూటీ మేనేజర్‌ కర్ణానాయక్, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు సారంగపాణి, ఆరెళ్లి పోచం, యాదగిరి సత్తయ్య, ఖయ్యూం, సుందిళ్ల సర్పంచ్‌ రుద్రబట్ల సునీతరఘు, ముస్త్యాల సర్పంచ్‌ సుంకరి మాధవి, సింగరేణి పాఠశాల, గాంధీ జూనియర్‌ కళాశాల, సెయింట్‌ పాల్స్‌ స్కూల్‌ విద్యార్థులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్, రోవర్స్, పోలీస్‌ శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు.  
     

Advertisement
Advertisement