ఇదేమి డయాలసిస్‌? | Sakshi
Sakshi News home page

ఇదేమి డయాలసిస్‌?

Published Thu, Jul 13 2017 10:51 PM

ఇదేమి డయాలసిస్‌?

విస్తుబోయిన ఆరోగ్య శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ వీణాకుమారి
రోగులకు ప్రతి నెలా పరీక్షలు తప్పనిసరి అంటూ సూచన


అనంతపురం మెడికల్‌ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని డయాలసిస్‌ కేంద్రంలో రోగులకు అందుతున్న సేవలపై ఆరోగ్యశాఖ రీజనల్‌ డైరెక్టర్‌ వీణాకుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు. యూనిట్‌ నిర్వహణ సరిగా లేదని, పరిస్థితిలో మార్పు తేవాలని సూచించారు. గురువారం ఉదయం జాతీయ ఆరోగ్య మిషన్‌ డీపీఎం డాక్టర్‌ అనిల్‌కుమార్, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌తో కలిసి డయాలసిస్‌ యూనిట్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డయాలసిస్‌ చేసే సమయంలో వాడేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌ నిర్వహణ సరిగా లేదని నిర్ధారణకు వచ్చారు. రోగులకు ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయాలని సూచించారు.

పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, ఎలా పడితే అలా ఉంచితే ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యేకంగా లాగ్‌బుక్‌ పెట్టాలని సూచించారు. నెఫ్రాలజిస్ట్‌  15 రోజులకు ఒకసారి వస్తున్నట్లు సిబ్బంది చెప్పడంతో సంబంధిత డాక్టర్‌ వివరాలు, ఎప్పుడు వస్తారన్న తేదీతో సహా ప్రదర్శనగా ఉంచాలని సూచించారు. మూత్రపిండ వ్యాధి గ్రస్తుల దగ్గర ప్రత్యేక పుస్తకం ఉంచాలని, అందులో వైద్య సేవల వివరాలన్నీ నమోదు చేయాలని సూచించారు. ఏఏ పరీక్షలు చేసింది రోగులకు తెలియజేయాలన్నారు. డయాలసిస్‌ నిర్వహణ తీరు తెన్నులపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ లలిత, డిప్యూటీ ఆర్‌ఎంఓ విజయమ్మ, మేనేజర్‌ శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement