అడుగడుగునా ఆత్మీయ స్వాగతం | Sakshi
Sakshi News home page

అడుగడుగునా ఆత్మీయ స్వాగతం

Published Thu, Feb 2 2017 11:37 PM

అడుగడుగునా ఆత్మీయ స్వాగతం - Sakshi

కదిరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి గురువారం దారిపొడువునా అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. ఆయన బెంగుళూరు విమానాశ్రయంలో ఉదయం 9 గంటలకు దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంగుండా పులివెందుల వెళ్లేందుకు బయలుదేరారు. జిల్లా పొలిమేరలోకి రాగానే టోల్‌గేట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ చిలమత్తూరు కన్వీనర్‌ సదాశివరెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కోడూరు తోపు సమీపంలో ముద్దప్పల్లి వద్ద పెనుకొండ నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు ఆ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, పార్టీ జిల్లా అధ్యక్షులు అయిన శంకర్‌నారాయణను వెంటబెట్టుకుని వచ్చి జగన్‌ను కలిశారు.

‘కియో కార్ల కంపెనీ కోసం ఈ ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుంటుందని మొరపెట్టుకున్నారు. ఆ కంపెనీకి భూములివ్వడానికి తమకు ఏమాత్రం ఇష్టం లేదని, అయితే బలవంతంగా సేకరిస్తున్నారని వారు ప్రతిపక్ష నేత దృష్టికి తెచ్చారు. కచ్చితంగా మీకు న్యాయం చేస్తామని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి క్రాస్‌ వద్ద పార్టీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు గంపల రామకృష్ణారెడ్డి, మహానేత వైఎస్‌కు సన్నితుడైన చలివెందుల లక్ష్మీనారాయణరెడ్డి, ఇంకా పలువురు నాయకులు, అభిమానులు, పలువురు మహిళలు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ఓ మహిళ పేర్కొంది.

చంద్రబాబు మోసాలు ఇంకెంతో కాలం సాగవని చెబుతూ వారి నుంచి సెలవు తీసుకున్నారు. తర్వాత మండల కేంద్రం గోరంట్లలో మండల కన్వీనర్‌ ఫకృద్దీన్, డా.బాషా ఇంకా పలువురు పార్టీ అధినేతను కలిశారు. అక్కడికొచ్చిన జనానికి వాహనమెక్కి జగన్‌ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఓడీ చెరువు మీదుగా కదిరి చేరుకున్నారు. జగన్‌ విచ్చేస్తున్న విషయం ముందే తెలుసుకున్న జనం వేమారెడ్డి కూడలిలో జనం పెద్ద సంఖ్యలో ముందే అక్కడికి చేరుకుని ఘన స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, లీగల్‌సెల్‌ రాష్ట్ర కార్యదర్శి లింగాల లోకేశ్వరరెడ్డి, పట్టణాధ్యక్షులు బాహవుద్దీన్, కౌన్సిలర్లు, ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌ను కలిశారు. ఆయనతో సెల్ఫీ దిగేందుకు యువకులు చాలామంది ఉత్సాహం కనబరిచారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement