Sakshi News home page

జోరు వాన

Published Thu, Sep 22 2016 10:31 PM

జోరు వాన

ఇందూరు : నిజామాబాద్‌ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. జిల్లా మొత్తం సగటున 36.6 మిల్లి మీటర్ల వర్షపాతన నమోదైంది. నవీపేట్, ఎడపల్లి, భీమ్‌గల్‌ మండలాల్లో అత్యధికంగా ఏడు సెంటి మీటర్ల చొప్పున వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. లింగంపేట మండలంలో పెద్దవాగు, పాముల వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో 11 ఇళ్లు «ధ్వంసమయ్యాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి గురువారం వెయ్యిక్యూసెక్కుల వరదనీటి ప్రవాహం వచ్చింది. ఎగువన ఉన్న మంజీర వాగు నీటితో నిండటంతో ప్రాజెక్టులోకి వరద నీరు వస్తోంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు, 17.8 టీఎంసీలకు గాను ప్రసుతం 1,367 మీటర్లతో 0.085 ఎమ్‌సీఎఫ్‌టీల నీరు ఉంది. మద్నూర్‌ మండలంలోని గోజేగావ్‌ గ్రామ శివారులోని లెండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోలెవల్‌ వంతెన పూర్తిగా నీట మునిగిపోవడంతో గ్రామానికి ఉదయం నుంచి రాత్రి వరకు రాకపోకలు నిలిచిపోయాయి. జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్ట్‌ ఒక్క గేటు ఎత్తి దిగువకు విడుదల చేపడుతున్నారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండడంతొ ప్రాజెక్ట్‌ పూర్తి నీటి మట్టం 458 మీటర్లతో నిండి 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్రలోని నాందేyŠ  జిల్లాలో భారీ వర్షాలకు  విష్ణుపురి జలాశయం నిండిపోగా నాలుగు గెట్లును తెరచి దిగువ తెలంగాణకు సరిహద్దులో ఉన్న బాబ్లి ప్రాజెక్టుకు నీరును వదులు తున్నారు. బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీరు జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వస్తుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement