తిరుమలకు పోటెత్తిన భక్తులు | Sakshi
Sakshi News home page

తిరుమలకు పోటెత్తిన భక్తులు

Published Fri, May 13 2016 9:32 PM

heavy rush in tirumala

తిరుమల: వేసవి సెలవులతో శుక్రవారం తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ సీజన్‌లో ఇంత స్థాయిలో భక్తులు రావటం ఇదే మొదటిసారి. ఏపీ, తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడటం, వారపు సెలవులు కావటంతో స్వామి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. సాయంత్రానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లూ భక్తులతో నిండిపోగా... బయట కిలోమీటరు మేర క్యూలో జనం నిరీక్షించారు. వీరికి 15 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది.

ఇక 14 కంపార్ట్‌మెంట్లలోని కాలిబాట భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. రద్దీ కారణంగా గదులు ఖాళీలేవు. కల్యాణకట్టల్లోనూ తలనీలాలు సమర్పించేందుకు నాలుగు గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది. అంగప్రదక్షిణం క్యూలో భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాగా, రద్దీ నేపథ్యంలో భక్తులకు సాధ్యమైనంత వేగంగా దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement