‘హలో వన్ సీ ఉంది.. పర్సంటేజ్ ఎంత?’ | Sakshi
Sakshi News home page

‘హలో వన్ సీ ఉంది.. పర్సంటేజ్ ఎంత?’

Published Fri, Nov 25 2016 2:45 AM

‘హలో వన్ సీ ఉంది.. పర్సంటేజ్ ఎంత?’ - Sakshi

రూ. 2 వేల నోట్లు ఇస్తారా లేక రూ.100 నోట్లా..
ఆర్మూర్‌లో జోరుగా కమీషన్ వ్యాపారం

ఆర్మూర్‌అర్బన్: ‘‘హలో నా పార్టీ దగ్గర వన్ సీ (రూ.కోటి) బ్లాక్‌మనీ ఉంది.. వైట్ చేయడానికి ఎంత పర్సంటేజ్ తీసుకుంటావు. నాకు ఎంత కమీషన్ ఇస్తావు..? నాతో కలుపుకొని ఇంకా ముగ్గురం ఉన్నాం. అందరం సంతృప్తి అయ్యేలా సెటిల్ చేయ్’’ ఇదీ ప్రస్తుతం కొద్ది రోజులుగా పెద్ద నోట్లపై నడుస్తున్న పర్సంటేజీల దందా. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టడానికి ఈ నెల 8న రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసేంద. దీంతో ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు ఆర్మూర్ ప్రాంతంలో పర్సంటేజీల దందాకు తెర లేపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాగే బ్లాక్‌మనీని వైట్ చేయడానికి బ్రోకర్ల అవతారమెత్తారు. ఎవరినీ చూసిన ఫోన్ పట్టుకుని గంటల తరబడి ఇవే లావాదేవీల గురించి చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రూ.లక్ష బ్లాక్ మనీని వైట్ చైయడానికి బ్రోకర్లు 20-30 శాతం వరకు ఆశిస్తున్నట్లు సమాచారం. అంటే రూ.లక్ష వైట్ కావాలంటే రూ.80 వేలు మిగులుతారుు. అరుుతే, ప్రభుత్వం కొన్నింటికి మినహారుుంపు ఇవ్వడంతో లావాదేవీలు ఫోన్ల వరకే పరిమితమయ్యాయని, ఎక్కడా సెటిల్‌మెంట్ జరగలేదని చెబుతున్నారు. ఈ గడువు గురువారం ముగియడంతో ఇక నల్లధనం పెద్ద మొత్తంలో బయటకు వస్తుందంటున్నారు.

పెరిగిన బంగారం ధర..
పెద్ద నోట్లు రద్దు కావడంతో పేరుకుపోరుున నల్లధనాన్ని మార్చుకోవడానికి బడా వ్యాపారులు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. ఎక్కువ ధర పెట్టిన బంగారం కొంటుండడంతో దాని ధర పెరిగిపోరుుంది. నోట్ల రద్దుతో భవిష్యత్తులో స్థిరాస్తుల విలువ పడిపోయే అవకాశం ఉందని కొందరు తమ ఇళ్ల స్థలాలు ఇప్పుడున్న ధరలకు విక్రరుుస్తున్నట్లు సమాచారం. నల్లధనం ఉన్న కొంత మంది పెద్ద మనుషులు స్థలాలను కొనుగోలు చేస్తూ స్థిరాస్తులుగా మార్చుకుంటున్నారు. స్థిరాస్తుల వ్యాపారంలో లావాదేవీలు జరిగిన పెద్ద నోట్లను చివరకు కొంత మంది జీరో అకౌంట్లలో పరిమితి వరకు జమ చేస్తున్నట్లు సమాచారం. జమ చేసే సమయంలో ఆరు నుంచి 12 నెలల వరకు వడ్డీ లేకుండా డబ్బులను వాడుకోవచ్చని ఎర వేస్తున్నట్లు తెలిసింది.

కరెన్సీ మార్పిడి కోసం బ్యాంకు ఎదుట ఆందోళన
రుద్రూర్ : రద్దరుున నోట్ల మార్పిడికి గురువారం చివరి రోజు కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బ్యాంకులకు పోటెత్తారు. దీంతో బ్యాంకులన్నీ కిటకిటలాడారుు. అరుుతే, రుద్రూర్ సిండికేట్ బ్యాంకులో డబ్బు ఇవ్వకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. చివరి రోజు కావడంతో ఖాతాదారులు పెద్ద సంఖ్యలో బ్యాంకుకు వచ్చారు. అరుుతే, బ్యాంకర్లు గంటలోపే విత్ డ్రాలను నిలిపివేయడంతో ఖాతాదారులు అసహనానికి గురయ్యారు. కరెన్సీ మార్పిడి చేసివ్వాలని ఆందోళన చేపట్టారు. సమాచారమందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఖాతాదారులతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దారు.

Advertisement
Advertisement