జూరాలకు భారీగా వరద | Sakshi
Sakshi News home page

జూరాలకు భారీగా వరద

Published Fri, Sep 23 2016 11:59 PM

hevy flods to joorala project

జూరాల : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. పరివాహక ప్రాంతంలో వర్షాలకుతోడు నారాయణపూర్‌ నుంచి విడుదలవుతున్న వరద కలిసి దాదాపు 70వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టులో ఐదు క్రస్టుగేట్లను ఎత్తేశారు. 63,095 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.41 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తూ పై నుంచి వస్తున్న వరదను దష్టిలో ఉంచుకొని ఐదు టర్బైన్లలో విద్యుదుత్పత్తి చేస్తూ 40వేల క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. ఐదు క్రస్టుగేట్లను ఒక మీటరు ఎత్తి స్పిల్‌వే ద్వారా 20,830 క్యూసెక్కుల వరద మొత్తం 63,095 క్యూసెక్కులను శ్రీశైలం రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. కష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి 27,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా విద్యుదుత్పత్తి ద్వారా అదేస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు దిగువన కర్ణాటకలో ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా పై నుంచి ఇన్‌ఫ్లో వస్తుండటంతో 33.07 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. 31,220 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద వస్తుండగా రెండు గేట్లు తెరిచి స్పిల్‌వే ద్వారా 12,600 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 6వేల క్యూసెక్కులు మొత్తం 18,600 క్యూసెక్కుల వరద నీటిని జూరాల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. 

Advertisement
Advertisement