గృహ నిర్మాణాల పరిశీలన | Sakshi
Sakshi News home page

గృహ నిర్మాణాల పరిశీలన

Published Mon, Jul 18 2016 5:21 PM

గృహ నిర్మాణాల పరిశీలన - Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: నగరంలోని కంపోస్టు కాలనీలో నిర్మిస్తున్న గహ నిర్మాణాలను ఆదివారం కలెక్టర్‌ పి.లక్ష్మీనసింహం పరిశీలించారు. హుదూద్‌ తుపాను వల్ల ఇళ్లు కోల్పోయిన 192 మంది లబ్ధిదారులకు కంపోస్టు కాలనీ వద్ద ఎన్టీఆర్‌ కాలనీ గహాలను ప్రభుత్వం గహనిర్మాణ సంస్థ ద్వారా నిర్మించిందని కలెక్టర్‌ తెలిపారు. ఒక్కొక్క బ్లాకులో 16 గహాలు చొప్పున నిర్మించామన్నారు. ప్రతి గహంలోను ఒక వంటిల్లు, ఒక పడక గది, ఒక హాలు, టాయ్‌లెట్ల సదుపాయం కల్పించామని తెలిపారు. 100 కిలో లీటర్ల సామర్థ్యంతో పెద్ద మంచినీటి సంప్‌ను నిర్మించామని, మున్సిపల్‌ ట్యాంకు నుంచి సంప్‌లో నీరు నింపి, ఇంటింటికీ రెండు పూటలా నీటి సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ఆయనతోపాటు గహ నిర్మాణ సంస్థ పీడీ పీఆర్‌ నరసింగరావు, ఈఈ పి.శ్రీనివాసరావు, డీఈఈ డి.శ్రీనివాసరావు, ఏఈ డి.సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement