మరీ ఇంత కక్కుర్తా మీకు..? | Sakshi
Sakshi News home page

మరీ ఇంత కక్కుర్తా మీకు..?

Published Sun, Dec 4 2016 8:44 PM

మరీ ఇంత కక్కుర్తా మీకు..?

* మహిళా పోలీసు స్టేషన్‌ని తనిఖీ చేసిన
మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని
అధికారుల తీరుపై ఆగ్రహావేశాలు
 
గుంటూరు (పట్నంబజారు): ‘మరీ ఇంత కక్కుర్తి ఏంటీ మీకు...కష్టాల్లో ఉండి వచ్చిన వారిని వదిలి పెట్టరా..? పురుషుల దగ్గర డబ్బులు తీసుకుని కేసులు తారుమారు చేస్తారా...? ఆపదలో ఉన్న వారికి ఇదేనా మీరిచ్చే ధైర్యం.. జనం అనటం కాదు...నేను చెప్పినా..పట్టించుకోవటంలేదు మీరు...క్యారక్టర్‌ల గురించి అసభ్యకరంగా మాట్లాడారా..’ అంటూ  ఏపీ మహిళా కమిషనర్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి మహిళా పోలీసుస్టేషన్‌లోని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆదివారం నన్నపనేని గుంటూరు నగరంలోని మహిళా పోలీసు స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ‘ఇక్కడ జరుగుతున్న భాగోతమంతా కథలుగా చెప్పుకుంటున్నారని, అసలు ఏ మాత్రం దయా, జాలి లేకుండా వ్యవహరిస్తున్నారా.. ఆఖరికి నేను చెప్పిన కేసుల్లో కూడా న్యాయం చేయకపోవగా..డబ్బులు అడిగారంటా’ అంటూ నిలదీశారు. 
 
రాష్ట్రంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదు...
రాష్ట్రంలోని అన్ని మహిళా పోలీస్టేషన్‌లకు వెళ్లా..ఇంత ఘోరమైన పరిస్థితులు ఎక్కడా చూడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  స్టేషన్‌లో సిబ్బంది లేకపోవటం, కేవలం ఎస్‌ఐ నాగకుమారి మాత్రమే ఉండటాన్ని గమనించారు. రికార్డులను అడిగి తీసుకొని పరిశీలించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పోలీసుస్టేషన్‌లో ఏ ఒక్కరూ సరిగా పనిచేయటంలేదని నిప్పులు చెరిగారు. ఆఖరికి బెయిల్‌కు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. స్టేషన్‌కు వచ్చిన వారిని అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతున్నాని తెలిసిందన్నారు.  అని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను హోంమంత్రి, డీజీపీల దగ్గరకు తీసుకెళ్తానన్నారు. కచ్చితంగా అవినీతి అధికారులను వదలిపెట్టే ప్రస్తకి లేదని తేల్చిచెప్పారు. నన్నపనేని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఎస్‌ఐ నాగకుమారి నీళ్ళు నిములారు.  అక్కడే ఉన్న బాధితులను ఎందుకు వచ్చారని అడిగి తెలుసుకున్నారు.
 
ప్రజల సమస్యల గురించి మాట్లాడటం తప్పా..: నన్నపనేని
పెద్దనోట్లు రద్దుతో సమస్యలు పడుతున్నారని ప్రజలు సమస్యల గురించి మాట్లాడితే బీజేపి నేతలు తనపై వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదంగా ఉందని నన్నపనేని వ్యాఖ్యానించారు. క్యూలైన్లులో నిలబడి ప్రాణాలు సైతం ఫణంగా పెడుతున్న క్రమంలో కనీస ఏర్పాట్లు చేయకపోవటంపై కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మంచినీటి వసతి కూడా ఏర్పాటు లేదు. దీనిపై ప్రశ్నిస్తే కొంత మంది మిత్రపక్షం నేతలకు ఎందుకు అంత ఆగ్రహమో అర్థం కావటం లేదన్నారు.

Advertisement
Advertisement